పేటలో కోడెల వారి అరాచకం..

ఏపీలో కేబుల్ బిజినెస్‌లోకి రాజకీయాలు చొరబడ్డాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరోసారి కేబుల్ వార్ మొదలైంది. వైసీపీ నాయకుడు నల్లపాటి రామచంద్రప్రసాద్‌కు చెందిన నల్లపాటి కేబుల్ విజన్‌(ఎన్‌సీవీ)పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైర్లు మొత్తం కత్తిరించివేశారు. ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. చివరకు దేవుడి పటాలను కూడా వదిలిపెట్టలేదు. ల్యాప్ ట్యాప్ లను ముక్కలు ముక్కలు చేశారు. ఆఫీస్ బయట ఉన్న వాహనాలను బండరాళ్లతో మోదీ నాశనం చేశారు. దాదాపు 50లక్షల రూపాయల ఆస్తి నష్టం […]

Advertisement
Update:2016-07-11 03:53 IST

ఏపీలో కేబుల్ బిజినెస్‌లోకి రాజకీయాలు చొరబడ్డాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరోసారి కేబుల్ వార్ మొదలైంది. వైసీపీ నాయకుడు నల్లపాటి రామచంద్రప్రసాద్‌కు చెందిన నల్లపాటి కేబుల్ విజన్‌(ఎన్‌సీవీ)పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైర్లు మొత్తం కత్తిరించివేశారు. ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. చివరకు దేవుడి పటాలను కూడా వదిలిపెట్టలేదు. ల్యాప్ ట్యాప్ లను ముక్కలు ముక్కలు చేశారు. ఆఫీస్ బయట ఉన్న వాహనాలను బండరాళ్లతో మోదీ నాశనం చేశారు.

దాదాపు 50లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అనుచరులతో కలిసి కేబుల్ కార్యాలయం వద్దకు వెళ్లారు. దీంతో మరోసారి కోడెల వర్గీయులు అక్కడికి వచ్చి గొడవ పడ్డారు. వైసీపీఎమ్మెల్యే బృందంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచరులు రాళ్లు రువ్వారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం విశేషం. దాడిలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ రూరుల్ తలకు తీవ్ర గాయమైంది. మరికొందరు గాయపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌సీవీ కేబుల్‌ కనెక్షన్లు లేకుండా చేసేందుకు స్పీకర్‌ కుమారుడు శివరామకృష్ణ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సీవీని పూర్తిగా దెబ్బతీసి మార్కెట్‌ మొత్తం తనకు చెందిన కె.కెబుల్‌తో ఆక్రమించాలన్నది కోడెల ప్రయత్నం అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్‌సీవీ కెబుల్‌ వైర్లు ధ్వంసం చేయడం, ఆఫీసుపై దాడి చేయడం జరిగిందని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరసరావుపేటలోని అందరూ కేబుల్ అపరేటర్లను కోడెల శివరామకృష్ణ బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు.

ఆపరేటర్ల దగ్గర ఖాళీ చెక్కులు తీసుకుని బెదిరించి అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద తండ్రి పవిత్రమైన స్పీకర్ స్థానంలో ఉన్నా సరే శివరామకృష్ణ ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొవడం ఆయన కుటుంబానికే కాకుండా పరోక్షంగా స్పీకర్ స్థానానికి కూడా చెడ్డపేరు తెస్తోంది. ఇటీవల తాను మొన్నటి ఎన్నికల్లో రూ. 11.5 కోట్లు ఖర్చుపెట్టానని స్పీకర్ కోడెల స్వయంగా చెప్పి సంచలనం సృష్టించారు. ఇలా పదేపదే కోడెల ఫ్యామిలీ వివాదాస్పదం అవుతూనే ఉంది. అయితే కేబుల్ కార్యాలయంపై దాడి ఘటనలోనూ ఎప్పటిలాగే పోలీసులు దాడి చేసిన వారిని కాకుండా బాధితులపైనే కేసులు పెట్టి తీసుకెళ్లడం కొసమెరుపు. టీడీపీ నేతలు మాత్రం ఎన్ సీవీ కేబుల్ వారే… కోడెల ఆధ్వర్యంలోని కె కెబుల్ వైర్లు కట్ చేశారని ఆరోపించడం విశేషం.

click on image to read-

Tags:    
Advertisement

Similar News