జగన్ ఆ తర్వాతైనా ఆలోచించుకోవాలి కదా..?

వైసీపీ ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. వైఎస్ ఉన్నప్పుడు తనకు విపరీతమైన ప్రాధాన్యత ఉండేదని .. కానీ ఇటీవల తనకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని చెప్పారు. వైసీపీలో తనకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయన్నారు. వైఎస్ ఉన్నప్పుడు తన నియోజకవర్గంలోకి మరోనాయకుడు వేలు పెట్టేవారు కాదన్నారు. కానీ ఇటీవల వైసీపీలో ఆపరిస్థితి కనిపించలేదన్నారు. తనకు ఎదురైన ఇబ్బందులు చిన్నచిన్నవే అయినా అవి పెద్దవిగా మారే సూచనలు కనిపించాయన్నారు. తొలుత ఈ విషయాలు […]

Advertisement
Update:2016-07-11 04:45 IST

వైసీపీ ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. వైఎస్ ఉన్నప్పుడు తనకు విపరీతమైన ప్రాధాన్యత ఉండేదని .. కానీ ఇటీవల తనకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని చెప్పారు. వైసీపీలో తనకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయన్నారు. వైఎస్ ఉన్నప్పుడు తన నియోజకవర్గంలోకి మరోనాయకుడు వేలు పెట్టేవారు కాదన్నారు. కానీ ఇటీవల వైసీపీలో ఆపరిస్థితి కనిపించలేదన్నారు.

తనకు ఎదురైన ఇబ్బందులు చిన్నచిన్నవే అయినా అవి పెద్దవిగా మారే సూచనలు కనిపించాయన్నారు. తొలుత ఈ విషయాలు జగన్‌కు తెలిసి ఉండకపోవచ్చని… కానీ తెలిసిన తర్వాతైనా ఆలోచించి సరిచేయాలి కదా అన్నారు. కానీ జగన్‌ వైపునుంచి ఆ ప్రయత్నం జరిగినట్టు కనిపించలేదని అందుకే పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు. ముఖ్యఅనుచరుడు, సర్పంచ్ వెంకటరెడ్డి హత్య అనంతరం ప్రాణ భయంతోనే తాను టీడీపీలో చేరానన్న అభిప్రాయంలో నిజం లేదన్నారు.

ప్రత్యర్థులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించినా దాన్ని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడే ఉన్నామన్నారు. కరణం బలరాంను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే కమ్మయేతర సామాజికవర్గాలు తనకు మద్దతు పలికిన మాట వాస్తవమేనని… ఇప్పుడు తాను పార్టీ మారినంత మాత్రాన వారంతా దూరమయ్యే పరిస్థితి ఉండదన్నారు. సీఎం చంద్రబాబు చెబితేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గొట్టిపాటి చెప్పారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ జనం తనవెంటే ఉన్నారని గొట్టిపాటి చెప్పారు. కరణం బలరాంతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఒక వేళ అదే చేయాల్సి వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News