జగ్గారెడ్డి అరెస్టుకు భయపడుతున్నారా?
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసులు బానాయించాలని చూస్తోందని ఆరోపించారు. తద్వారా తనను అరెస్టు చేయించాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వానికే హెచ్చరికలు పంపారు. నన్ను ముట్టుకుని చూడండి.. నా తడాఖా చూపిస్తా.. అంటూ సవాలు విసిరారు. తనను తాకితే తానేంటే తెలుస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు టీఆర్ ఎస్ ప్రభుత్వంలోని […]
Advertisement
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసులు బానాయించాలని చూస్తోందని ఆరోపించారు. తద్వారా తనను అరెస్టు చేయించాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వానికే హెచ్చరికలు పంపారు. నన్ను ముట్టుకుని చూడండి.. నా తడాఖా చూపిస్తా.. అంటూ సవాలు విసిరారు. తనను తాకితే తానేంటే తెలుస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు టీఆర్ ఎస్ ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలను తమ మాటలతో తూర్పార పట్టిన జగ్గారెడ్డి చాలాకాలం తరువాత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే.. రెండు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి.. ఆయన అరెస్టుకు భయపడుతున్నారా? లేక ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. ఆయన ముక్కోపి అన్న పేరు ఉంది. నిత్యం మాటల్లో, చేతలతో దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ దుందుడుకు స్వభావం కారణంగా ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, అప్పట్లో అధికారపార్టీ కాబట్టి సరిపోయింది. 2014 తరువాత బీజేపీలోకి జంప్ చేసి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా, కేసులకు భయపడే మనిషి కాదు జగ్గారెడ్డి. గతంలో ఆయనపై చాలా కేసులు నమోదైనా.. ఏనాడూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఈసారి తాను అరెస్టు అయ్యే అవకాశముందని తన అనుచరులకు, నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగానే తెలియజెప్పాడం వెనక ఏదైనా వ్యూహముందా? అని సంగారెడ్డి ప్రజలు చర్చించుకుంటున్నారు.
Advertisement