అమరావతికి అంతసీన్ లేదన్న చౌదరి
అమరావతి త్రీడి బొమ్మల భ్రమల్లోనే ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒకదారిలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఏకంగా 2019లో అమరావతి వేదికగా ఒలంపిక్స్ నిర్వహిస్తాయని చంద్రబాబు స్వయంగా ప్రకటించి నవ్వులు పూయించారు. అంతకుముందే 2018లో అమరావతిలో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మంత్రులు కూడా పదేపదే ఈ విషయం చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పీ ఆర్ మోహన్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే అమరావతికి […]
అమరావతి త్రీడి బొమ్మల భ్రమల్లోనే ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒకదారిలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఏకంగా 2019లో అమరావతి వేదికగా ఒలంపిక్స్ నిర్వహిస్తాయని చంద్రబాబు స్వయంగా ప్రకటించి నవ్వులు పూయించారు. అంతకుముందే 2018లో అమరావతిలో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మంత్రులు కూడా పదేపదే ఈ విషయం చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పీ ఆర్ మోహన్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే అమరావతికి అంత సీన్ లేదని బ్యాడ్మింటన్ ఇండియా సంఘం కార్యదర్శి చెంచు పున్నయ్య చౌదరి వ్యాఖ్యానించాడు.
2019లో అమరావతి వేదికగా నేషనల్ గేమ్స్ నిర్వహిస్తామని మంత్రులు చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. అసలు 2019లో నేషనల్ గేమ్స్ నిర్వహించే బిడ్‌లో పాల్గొనే అర్హత కూడా అమరావతికి లేదని తేల్చేశారు. బిడ్‌లో పాల్గొనాలంటే ఇప్పటికే స్టేడియం నిర్మాణం, ఇతర ఏర్పాట్లు కనీసం సగం పనులు పూర్తి కావాల్సిందని ఆయన అన్నారు. చెంచు పున్నయ్య చౌదరి వ్యాఖ్యలతోనైనా అమరావతి త్రీడి బొమ్మల భ్రమ నుంచి ప్రభుత్వం బయటపడితే మంచిదన్న మాట.
click on image to read-