మోడీ...ఆమెని ముంచేశాడు!

ఓ మ‌హిళ‌తో స‌హ‌జీవనంలో ఉన్న వ్య‌క్తి ఆమెను దారుణంగా మోసం చేసి 30ల‌క్ష‌లు కాజేసిన ఘ‌ట‌న గుజరాత్‌లో జ‌రిగింది. అహ్మ‌దాబాద్ సిటీ, న‌వ్‌రంగ్ పురాకు చెందిన ఆర్తి సంధారియా(42) అనే మ‌హిళ ఆశిష్ మోడీ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. మోడీ ఆ మ‌హిళ‌ను మోసం చేసి ఆమె సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి  వివిధ బ్యాంకుల నుండి ల‌క్ష‌ల్లో డ‌బ్బు డ్రా చేసుకుని మాయ‌మైపోయాడు. 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కొడుకు ఉన్న ఆర్తి,  స్కూలు […]

Advertisement
Update:2016-07-09 09:31 IST

ఓ మ‌హిళ‌తో స‌హ‌జీవనంలో ఉన్న వ్య‌క్తి ఆమెను దారుణంగా మోసం చేసి 30ల‌క్ష‌లు కాజేసిన ఘ‌ట‌న గుజరాత్‌లో జ‌రిగింది. అహ్మ‌దాబాద్ సిటీ, న‌వ్‌రంగ్ పురాకు చెందిన ఆర్తి సంధారియా(42) అనే మ‌హిళ ఆశిష్ మోడీ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. మోడీ ఆ మ‌హిళ‌ను మోసం చేసి ఆమె సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి వివిధ బ్యాంకుల నుండి ల‌క్ష‌ల్లో డ‌బ్బు డ్రా చేసుకుని మాయ‌మైపోయాడు.

17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కొడుకు ఉన్న ఆర్తి, స్కూలు టీచ‌రుగా ప‌నిచేస్తోంది. ఆరేళ్ల క్రితం ఆమె ఒక కారుని కొన‌డానికి ప్ర‌య‌త్నించిన‌పుడు ఆ కారు గురించి ఆమెకు వివ‌రించే విధుల్లో ఉన్న ఆశిష్ మోడీతో ప‌రిచ‌యమైంది. అప్ప‌టికే అత‌ను త‌న భార్య‌నుండి 12ఏళ్లుగా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వారిద్ద‌రూ స‌హ‌జీవనంలో కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదిలా ఉండ‌గా, ఏప్రిల్ నెల‌లో పిల్ల‌ల ఫీజు క‌ట్ట‌డానికి ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకుల నుండి డ‌బ్బుని తీయ‌డానికి వెళ్లిన ఆర్తి, త‌న‌ ఖాతాల్లో రూ.500, రూ.200 ఉండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. రెండు అకౌంట్ల నుండి ల‌క్షరూపాయ‌ల‌ చొప్పున డ్రా చేసిన‌ట్టుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉంది. త‌రువాత ఆమె త‌న యాక్సిస్ బ్యాంకు అకౌంటుని చెక్ చేసుకోగా ఓవ‌ర్‌డ్రాఫ్ట్ ఎకౌంట్‌నుండి 8ల‌క్ష‌లు డ్రా అయిన‌ట్టుగా ఉంది. క్రెడిట్ కార్డుని ఉప‌యోగించి మ‌రో 8 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టుగా తేలింది. ఆశిష్‌కి ఫోన్ చేయ‌గా…డ‌బ్బు తీశాన‌ని త్వ‌ర‌లో ఇస్తాన‌ని చెప్పాడు. అత‌ను ఎక్క‌డున్నాడో చెప్ప‌మని అడ‌గ్గా ఆ వివ‌రాలు చెప్ప‌క‌పోగా ఫోన్ క‌ట్ చేశాడు. త‌రువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అత‌ను అందుబాటులోకి రాక‌పోవ‌టంతో ఆర్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఆశిష్ మోడీ త‌న సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేసి, సెల్ ఫోన్ నుండి అకౌంట్స్ పిన్ నెంబ‌ర్లను తెలుసుకుని త‌న‌ని మోసం చేశాడ‌ని, బ్యాంకుల నుండి డ‌బ్బు డ్రా చేసుకుని పోయాడ‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, నాలుగేళ్ల క్రితం అత‌ను వ్యాపారం చేసుకుంటాను అంటే 9ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్టుగా చెప్పింది. మ‌రొక‌సారి మ‌రో నాలుగు ల‌క్ష‌లు ఇచ్చింది. మొత్తంమీద ఆశిష్ మోడీ ఆమెనుండి 30 ల‌క్ష‌ల‌కు పైగా సొమ్ముని కాజేసి క‌నిపించ‌కుండా మాయ‌మైపోయాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News