పొలంలో బయటపడ్డ బంగారం పెట్టె
విజయనగరం జిల్లాలోని ఒక పొలం బంగారం నిధి బయటపడింది. లీజుకు తీసుకున్న పొలాన్ని ప్రొక్లెయినర్ల సాయంతో రైతు అభివృద్ధి చేయించగా… మరుసటి రోజు కురిసిన వర్షానికి ఒక పెట్టె వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌కు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో కొంత భూమి ఉంది. ఈ భూమిని సాలూరుకి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు తీసుకుని సాగుచేస్తున్నారు. శుక్రవారం వరకు భూమిని యంత్రాల సాయంతో బాగు చేయించారు. మరుసటి రోజు కురిసిన వర్షానికి ఒక […]
విజయనగరం జిల్లాలోని ఒక పొలం బంగారం నిధి బయటపడింది. లీజుకు తీసుకున్న పొలాన్ని ప్రొక్లెయినర్ల సాయంతో రైతు అభివృద్ధి చేయించగా… మరుసటి రోజు కురిసిన వర్షానికి ఒక పెట్టె వెలుగుచూసింది.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌కు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో కొంత భూమి ఉంది. ఈ భూమిని సాలూరుకి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు తీసుకుని సాగుచేస్తున్నారు. శుక్రవారం వరకు భూమిని యంత్రాల సాయంతో బాగు చేయించారు. మరుసటి రోజు కురిసిన వర్షానికి ఒక పెట్టె బయటపడింది. ఈ పెట్టె శ్యామల గౌరీపురానికి చెందిన ఒక యువతికి చిక్కింది. సదరు యువతి దాన్ని తీసుకెళ్లి ఊరిలో నీటి పంపు దగ్గర శుభ్రం చేసి ఇంటికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
యువతికి పెట్టె దొరికిన విషయం తెలియడంతో గ్రామంలో సంచలనంగా మారింది. పెట్టె దొరికి భూమిలో వెతకగా అక్కడ మరికొన్ని బంగారుచైన్లు, ముక్కుపుడకలు దొరికినట్టు సమాచారం. యువతికి దొరికిన పెట్టెలో బంగారు పూసలు, గొలుసులు, ఇతర ఆభరణాలు, నాణేలు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాస్ రెడ్డితో పాటు కొందరు గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు. పొలంలో దొరికిన ఒక బంగారు గొలుసును ఒక నగల దుకాణంలో విక్రయించినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ఎంత బంగారం దొరికింది అది ఎక్కడుంది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.