కూతురి హత్య కేసులో తల్లికి బెయిల్...ఆమె ప్రియుడికి నిరాకరణ!
మైనర్ బాలిక హత్యకేసులో గత ఏడాది డిసెంబరు నుండి పోలీస్ కస్టడీలో ఉన్న ఆమె తల్లికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాలికను స్వయంగా హత్య చేసిన తల్లి ప్రియుడికి కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఈ కేసులో నిందితులు శోభ, సతీషా. వీరిద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. తన తల్లి అతనితో కలిసి ఉండటం నచ్చని యుకెజి చదువుతున్న శోభ కుమార్తె తరచుగా గొడవ చేస్తుండేది. దాంతో వారిద్దరూ ఆ చిన్నారిని బాగా కొడుతుండేవారు. ఈ క్రమంలో […]
మైనర్ బాలిక హత్యకేసులో గత ఏడాది డిసెంబరు నుండి పోలీస్ కస్టడీలో ఉన్న ఆమె తల్లికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాలికను స్వయంగా హత్య చేసిన తల్లి ప్రియుడికి కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఈ కేసులో నిందితులు శోభ, సతీషా. వీరిద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. తన తల్లి అతనితో కలిసి ఉండటం నచ్చని యుకెజి చదువుతున్న శోభ కుమార్తె తరచుగా గొడవ చేస్తుండేది. దాంతో వారిద్దరూ ఆ చిన్నారిని బాగా కొడుతుండేవారు.
ఈ క్రమంలో ఒక రోజు శోభ ఇంట్లో లేని సమయంలో సతీషా చిన్నారి తలను గోడకు కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె బాత్ రూంలో జారిపడిందంటూ తల్లి ఆసుపత్రిలో జాయిన్ చేసింది. గత ఏడాది డిసెంబరులో తన కుమార్తె కిందపడి మరణించిందని శోభ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ చేయించింది. అయితే రెండువారాల అనంతరం చిన్నారి పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఆమె బలమైన దెబ్బలతో మరణించినట్టుగా తేలటంతో పోలీసులు శోభని, సతీషాని తమ కస్టడీలోకి తీసుకున్నారు. శోభని ఇంటరాగేట్ చేశారు.
దాంతో శోభ తన తప్పుని ఒప్పుకోవటంతో పాటు, తాము చాలా సార్లు పాపని బాగా హింసించామని వెల్లడించిండి. తమ ఏకాంతానికి అడ్డుగా ఉందని పాపని వారిద్దరూ చంపినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శోభ, సతీషా ఇద్దరూ బెయిల్ కోసం అప్లయి చేయగా, కోర్టు శోభకు మాత్రమే మంజూరు చేసింది. హత్య జరిగిన సమయంలో శోభ ఇంట్లో లేదన్నవిషయం స్పష్టం కావటంతో ఆమెకు బెయిల్ ఇస్తున్నట్టుగా పేర్కొంది. అయితే పాప హత్య విషయంలో ఆమె సతీషాతో కలిసి ప్లాన్ చేసిందా లేదా అనేది ట్రయల్ కోర్టు తేల్చాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.