స్మృతి, సుష్మా అలిగారంట‌!

కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఇటీవ‌ల ఇద్ద‌రు మంత్రులు అలిగార‌న్న వార్త‌లు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారిలో మొద‌టిది సుష్మా స్వ‌రాజ్‌. ఆమె శాఖ‌లోకి ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంజే అక్బ‌ర్ ను స‌హాయ మంత్రిగా తీసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. త‌న ప‌రిధికి ప‌రిమితులు విధించేందుకే మోదీ త‌న అనుచ‌రుడు అయిన అక్బ‌ర్‌ను రంగంలోకి దింపాడ‌ని అందుకు ఆమె అలిగార‌ని స‌మాచారం. అందుకే, ఆమె కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి  హాజ‌రు కాలేద‌న్న వార్త‌లు […]

Advertisement
Update:2016-07-08 04:26 IST
కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఇటీవ‌ల ఇద్ద‌రు మంత్రులు అలిగార‌న్న వార్త‌లు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారిలో మొద‌టిది సుష్మా స్వ‌రాజ్‌. ఆమె శాఖ‌లోకి ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంజే అక్బ‌ర్ ను స‌హాయ మంత్రిగా తీసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. త‌న ప‌రిధికి ప‌రిమితులు విధించేందుకే మోదీ త‌న అనుచ‌రుడు అయిన అక్బ‌ర్‌ను రంగంలోకి దింపాడ‌ని అందుకు ఆమె అలిగార‌ని స‌మాచారం. అందుకే, ఆమె కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్వ‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి అదేమీ లేద‌ని, తాను అదే స‌మ‌యంలో మ‌రో కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్నాన‌ని, దీన్ని అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేయ‌వ‌ద్ద‌ని మీడియాకు విజ్ఞ‌ప్తి చేశారు.
ఇక మ‌రో మంత్రి స్మృతి ఇరానీ. ఈమె ఏ ముహూర్తాన ప‌ద‌వి చేప‌ట్టిందో గానీ, ఈమెను కాపాడేందుకు మోదీ ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించింది. ఈమె విద్యార్హ‌త మొద‌లు, యూనివ‌ర్సిటీ పాల‌క వ్య‌వ‌హారాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నార‌ని, రోహిత్ ఆత్మ‌హ‌త్య‌, ఢిల్లీ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై దేశ‌ద్రోహం కేసులు మోదీ ప్ర‌భుత్వానికి మ‌చ్చ తెచ్చాయి. వీటిని స‌మ‌ర్ధించుకునేందుకు ఒక ద‌శ‌లో కేంద్ర హోంమంత్రి కూడా ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సి వ‌చ్చింది. అవి వాస్త‌వాలు కాద‌ని తెలిసిన త‌రువాత‌ రాజ్‌నాథ్ కు కూడా భంగ‌పాటు త‌ప్ప‌లేదు. దీంతో ఇవ‌న్నీ ఎందుకు? అని ఆమెను జౌళి శాఖ‌కు మార్చారు.
కీల‌కశాఖ‌లను ఇత‌రుల‌తో పంచుకోవ‌డం.. ప్రాధాన్యం త‌క్కువ ఉన్న ప‌ద‌వుల‌కు మార‌డం అంటే ఎవ‌రికైనా ఇబ్బందే క‌దా! అయినా.. ఈ ఇద్ద‌రు మంత్రులు మాత్రం ఈ విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.
Tags:    
Advertisement

Similar News