చెవిరెడ్డికి ఎంత కష్టమొచ్చింది? 15రోజుల రిమాండ్

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పుత్తూరు కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు. తిరుపతి రూరల్ మండలం పేరూరులో వైసీపీ కార్యకర్త ఇంటిని కూల్చివేసేందుకు గురువారం పోలీసులు ప్రయత్నించంగా చెవిరెడ్డి అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో రెవిన్యూ సిబ్బంది వైసీపీకార్యకర్త ఇంటిని కూల్చివేశారు. దీనికి నిరసనగా సబ్‌ కలెక్టర్ కార్యాలయం ముందు చెవిరెడ్డి బైఠాయించారు. దీంతో చెవిరెడ్డితో పాటు మరో 9మందిని అరెస్ట్ చేశారు. సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. […]

Advertisement
Update:2016-07-08 07:17 IST

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పుత్తూరు కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు. తిరుపతి రూరల్ మండలం పేరూరులో వైసీపీ కార్యకర్త ఇంటిని కూల్చివేసేందుకు గురువారం పోలీసులు ప్రయత్నించంగా చెవిరెడ్డి అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో రెవిన్యూ సిబ్బంది వైసీపీకార్యకర్త ఇంటిని కూల్చివేశారు. దీనికి నిరసనగా సబ్‌ కలెక్టర్ కార్యాలయం ముందు చెవిరెడ్డి బైఠాయించారు. దీంతో చెవిరెడ్డితో పాటు మరో 9మందిని అరెస్ట్ చేశారు. సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

అయితే రాత్రికి పోలీసులు పాత కేసులను బయటకు తీశారు. 2013లో సర్చంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న చెవిరెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో కోర్టుకు హాజరు కాలేదంటూ చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు వచ్చి మరీ అర్థరాత్రి చెవిరెడ్డిని తన ఇంటి వద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించారు. చెవిరెడ్డిని పుత్తూరు కోర్టులో హాజరుపరచగా 15రోజుల రిమాండ్ విధించారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె కూడా చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. తన ఊరికి చెవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండడాన్ని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఇలా పదేపదే ఆయన్ను అరెస్ట్ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ కు పెద్ద అభిమాని అయిన చెవిరెడ్డిని ఆయన జయంతి రోజు పూలదండ కూడా వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మొత్తానికి అడ్డుకుంది.

click on image to read-

Tags:    
Advertisement

Similar News