ఇలాగైతే తనిఖీలు చేస్తాం... ఏపీకి నీతి ఆయోగ్‌ హెచ్చరిక

తెలుగు గ్లోబల్. కామ్: కేంద్రం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ నుంచి రివర్స్ పంచ్‌ పడింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడంపై నీతిఆయోగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు దారి మళ్లించడమే కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ వెనుకబడిన జిల్లాల్లోనే ఖర్చు చేశామంటూ తప్పుడు లెక్కలు పంపడంతో మండిపడింది. మా చెవిలోనే పూలుపెడుతారా అని ఫైర్ అయింది. రెండేళ్లలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ […]

Advertisement
Update:2016-07-06 03:15 IST

తెలుగు గ్లోబల్. కామ్: కేంద్రం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ నుంచి రివర్స్ పంచ్‌ పడింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడంపై నీతిఆయోగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు దారి మళ్లించడమే కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ వెనుకబడిన జిల్లాల్లోనే ఖర్చు చేశామంటూ తప్పుడు లెక్కలు పంపడంతో మండిపడింది. మా చెవిలోనే పూలుపెడుతారా అని ఫైర్ అయింది.

రెండేళ్లలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం జిల్లాకు వందకోట్ల చెప్పున కేంద్రం మొత్తం 700 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులను చంద్రబాబు ప్రభుత్వం వేరే పనులకు ఖర్చు చేసింది. విద్య, ఆరోగ్యం, మంచినీటి వసతి తదితర వాటికి నిధులను ఖర్చు చేయాల్సి ఉన్నా వాటిని చంద్రబాబు కలెక్టర్లకు పంపారు. దీంతో ఆ నిధులను కలెక్టర్లు సీఎం పర్యటనలు, సభలు, వేదికలపై వాడే కూలర్లు, డెకరేషన్లు, స్కానింగ్ యంత్రాలు కొనేందుకు వాడేశారు.

కేంద్రానికి మాత్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే నిధులు ఖర్చు చేసినట్టు నివేదిక పంపారు. అయితే నీతి ఆయోగ్ చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని పసిగట్టింది. మొత్తం 700కోట్లలో కేవలం రూ. 7.92 కోట్లు మాత్రమే వెనుకబడిన ఏడు జిల్లాలకు ఖర్చు చేసినట్టు నీతి ఆయోగ్ నిర్దారించింది. సరైన లెక్కలు పంపాలని లేని పక్షంలో కేంద్రం నుంచి తనిఖీలకు ప్రత్యేక బృందాన్ని పంపుతామని హెచ్చరించింది. దీంతో ఒకవేళ నీతి ఆయోగ్ ప్రత్యేక బృందం వస్తే 700 కోట్లకు మేర ఏఏ పనులను చూపాలన్న దానిపై ఏపీప్రభుత్వం ఆలోచన మొదలుపెట్టిందని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News