ఆయనతో మీకెందుకు?- బాబు రివర్స్

అధినేత చెబితే తమ్ముళ్లు ఊరకుంటారా?. ఉండరు గాక ఉండరు. విజయవాడ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే చేశారు. విజయవాడలో ఆలయాలు కూల్చేసి అభివృద్ధి పనిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించడంతో ఈ ఇద్దరు నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబుపై వీర భక్తి ప్రదర్శించే క్రమంలో రామభక్త హనుమాన్ విగ్రహాన్ని కూడా పెకిలించివేశారు. ఇలాంటి పనులు రాజకీయనాయకులు చేసినా వాటిని తెలివిగా అధికారుల మీదకు నెట్టేస్తుంటారు. కానీ కేశినేని, బుద్దా మాత్రం చంద్రబాబు అండ చూసుకుని రెచ్చిపోయారు. ఏకంగా […]

Advertisement
Update:2016-07-06 16:31 IST

అధినేత చెబితే తమ్ముళ్లు ఊరకుంటారా?. ఉండరు గాక ఉండరు. విజయవాడ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే చేశారు. విజయవాడలో ఆలయాలు కూల్చేసి అభివృద్ధి పనిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించడంతో ఈ ఇద్దరు నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబుపై వీర భక్తి ప్రదర్శించే క్రమంలో రామభక్త హనుమాన్ విగ్రహాన్ని కూడా పెకిలించివేశారు. ఇలాంటి పనులు రాజకీయనాయకులు చేసినా వాటిని తెలివిగా అధికారుల మీదకు నెట్టేస్తుంటారు.

కానీ కేశినేని, బుద్దా మాత్రం చంద్రబాబు అండ చూసుకుని రెచ్చిపోయారు. ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి తమ పనిని సమర్ధించుకున్నారు. కూల్చిన ఆలయాలను చూసేందుకు వెళ్లిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోమువీర్రాజుల ప్రెస్‌మీట్‌ను బుద్దా వెంకన్న అడ్డుకున్నారు. దీంతో పీఠాధిపతులు రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. అయితే బీజేపీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే క్రమంలో కేశినేని నాని … ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చారు. మేమే కాదు… గుజరాత్‌లో మోదీ ఏకంగా 80 ఆలయాలను కూల్చేశారు. మోదీ చేస్తే ఒప్పు మేం చేస్తే తప్పా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

ఆలయాల కూల్చివేతలో మోదీ పాపం కూడా ఉందని చాటే ప్రయత్నం చేశారు.ఇదే బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మోదీని కూడా నెగిటివ్‌గా చూపే ప్రయత్నం చేస్తారా చూస్తాం… ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని ఫీలర్లు వదిలారు. పరిస్థితి చాలా దూరం వెళ్లేలా ఉండడంతో కేశినేని, బుద్దాలకు చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేశారని చెబుతున్నారు. చెప్పింది ఏంటి మీరు చేస్తుందని ఏమిటి అని చంద్రబాబు క్లాస్ పీకారట. అసలు మోదీ ప్రస్తావన ఎందుకు తెచ్చారంటూ రుసరుసలాడారట. దీంతో కంగుతినడం ఇద్దరి నేతల వంతైంది. సీఎం చెప్పిన ఆదేశాలను పాటించిన మమ్మల్ని మెచ్చుకుంటారనుకుంటే రివర్స్‌లో కోపడ్డారేంటని తెగ ఫీలైపోయారట. అంతే మరీ ఆలయాలను కూల్చి మంచిపని చేశారని ఎవరైనా మెచ్చుకుని ఉంటే అది బాబు ఖాతాలో పడేది. తిరబడి అందరూ తిట్టిపోశారు కదా…. బాధితులు కేశినేని, బుద్దా లాంటి వారే అవుతారు. అయినా గోశాల కూల్చినా దాని పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవనానికి మాత్రం ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడంతో బుద్దా వెంకన్న మాత్రం విజయం సాధించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News