కేసీఆర్, అసద్‌లపై గవర్నర్‌కు ఫిర్యాదు... చంద్రబాబును వదిలారేం?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై కమలనాథులు గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇద్దరు పార్టీ అధినేతలపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడం అరుదైన విషయమే! ఇదే సమయంలో హిందుత్వపార్టీగా పేరొందిన కాషాయదళం వారు విజయవాడలో గుడులు నేలమట్టమవుతుంటే మాత్రం ఆ విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. పాలమూరు […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై కమలనాథులు గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇద్దరు పార్టీ అధినేతలపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడం అరుదైన విషయమే! ఇదే సమయంలో హిందుత్వపార్టీగా పేరొందిన కాషాయదళం వారు విజయవాడలో గుడులు నేలమట్టమవుతుంటే మాత్రం ఆ విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులపై న్యాయపోరాటం చేస్తోన్న బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై ఇటీవల దాడి చేసేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అవినీతిని ప్రశ్నించింనందుకు మాపై దాడులు చేయడమేంటని బీజేపీ నాయకులు వాపోయారు.
పనిలోపనిగా…. మరోపార్టీ అధినేత.. ఎంపీ అసదుద్దీన్‌పైనా కమలనాథులు కంప్లయింట్ ఇచ్చారు. ఆయన దేశంలో ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. నగరంలో ఉగ్రదాడుల్లో నిందితులకు న్యాయ సహాయం అందిస్తానని ఆయన అనడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారికి ఇలాంటి సహాయం అందిస్తామనడం ద్వారా ఒవైసీ ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని.. గులాబీ నేతలు లైట్ గా తీసుకుంటున్నారు. విజయవాడలో పదుల సంఖ్యలో గుళ్లు ధ్వంసమవుతుంటే.. బీజేపీ నేతలు కళ్లు మూసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉన్నపుడు కేసీర్, అసద్‌లపై చేసినట్లుగానే.. టీడీపీ అధినేతపైనా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఆర్నెళ్ల కోసారి అయోధ్యలో రాముని గుడి కడతామంటూ గొప్పలు చెప్పుకునే కమలనాథులు.. ఆంధ్రాలో ఆలయాలు నేలమట్టం అవుతోంటే.. ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. పదవులు, పొత్తుల కోసం విలువలను తాకట్టు పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి గులాబీ నేతల మాటలకు కమలనాథులు కౌంటర్ ఇస్తారా? అన్నది అనుమానమే!
Advertisement