ఉగ్రవాదులను వదలొద్దు.. కానీ, వారు అమాయకులు!
హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి కుట్రపన్నారన్న అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) పాతబస్తీకి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే! దీంతో నగరానికి భారీ ముప్పు తప్పిందని దేశ నిఘా సంస్థలు, పోలీసు సంస్థలు ప్రకటించాయి. ఈ అంశం క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. నగరంలో శాంతి భద్రతలపై ఆదివారం దిల్ కుషా గెస్ట్ హౌజ్‌లో పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఉగ్రకార్యకలాపాలకు […]
Advertisement
హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి కుట్రపన్నారన్న అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) పాతబస్తీకి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే! దీంతో నగరానికి భారీ ముప్పు తప్పిందని దేశ నిఘా సంస్థలు, పోలీసు సంస్థలు ప్రకటించాయి. ఈ అంశం క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. నగరంలో శాంతి భద్రతలపై ఆదివారం దిల్ కుషా గెస్ట్ హౌజ్‌లో పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఉగ్రకార్యకలాపాలకు తావివ్వకుండా గట్టి చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ పోలీసు అధికారులకు సూచించారు. ఇందుకోసం కేంద్ర నిఘా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. నగరంలో ఎలాంటి ఉగ్రచర్యలకు తావివ్వకూడదని, అలాంటి చర్యలను ఎప్పటికప్పుడు తొక్కిపెట్టాలని చెప్పారు. ఉగ్రమూకల కదలికలను ముందస్తుగా పసిగట్టి నిర్వీర్యం చేసిన ఎన్ ఐ ఏ, రాష్ట్ర పోలీసు సంస్థలను ఆయన అభినందించారు.
కానీ వారు అమాయకులు: అసద్
నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారంటూ ఎన్ ఐ ఏ అరెస్టు చేసిన యువకులంతా అమాయకులేనని హైదరాబాద్ ఎంపీ అసద్ స్పష్టం చేశారు. కేంద్రం కావాలని అమాయక యువకులను ఇలాంటి కేసుల్లో ఇరికిస్తోందని ఆరోపించారు. అరెస్టయిన యువకులందరికీ న్యాయసహాయం అందిస్తామని అసద్ వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి కేసుల్లో పలుమార్లు పాతబస్తీ యువకులను అరెస్టు చేయగా.. వారిలో చాలామంది నిర్దోషులని తేలిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐఎస్ ఐఎస్ పై నిప్పులు చెరిగారు. అది సైతాన్ అక్రమ సంతానమని పోల్చారు. యువకులు ఎలాంటి ప్రలోభాలకు లొంగి ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకూడదంటూ.. పిలుపునిచ్చారు.
Advertisement