"ముందు ఆపండి"... కన్నా ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న బుద్ధా వెంకన్న
విజయవాడలో 40 హిందూఆలయాల కూల్చివేత దుమారం రేపుతోంది. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా టీడీపీ ఎంపీ కేశినేని, ఇతర నాయకులు దగ్గరుండి మరీ ఆలయాలను కూల్చివేయించడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం నేతలుగా ముద్రపడిన కన్నా లక్ష్మినారాయణ, సోమువీర్రాజు తదితరులు ఆలయాలు కూల్చివేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న తన అనుచరులతో కలిసి వచ్చి హల్ చల్ చేశారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. […]
విజయవాడలో 40 హిందూఆలయాల కూల్చివేత దుమారం రేపుతోంది. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా టీడీపీ ఎంపీ కేశినేని, ఇతర నాయకులు దగ్గరుండి మరీ ఆలయాలను కూల్చివేయించడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం నేతలుగా ముద్రపడిన కన్నా లక్ష్మినారాయణ, సోమువీర్రాజు తదితరులు ఆలయాలు కూల్చివేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న తన అనుచరులతో కలిసి వచ్చి హల్ చల్ చేశారు.
బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆలయాల కూల్చివేతపై కన్నా లక్ష్మినారాయణ, సోమువీర్రాజు ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సిద్దపడగా బుద్దా వెంకన్న ఆగ్రహంతో ఊగిపోయారు. ”ముందు ప్రెస్‌మీట్ ఆపండి. వెళ్లి మీ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి” అంటూ బీజేపీ నేతల మీదకు దూసుకెళ్లారు. బుద్దా వెంకన్న వెంట వచ్చిన కొందరు టీడీపీ నేతలు … బీజేపీ నేతలను తీవ్ర పదజాలంతో దూషించారు. ఒక దశలో రెండు పార్టీ కార్యకర్తలు తోపులాటకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు సోమువీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్దికి తాము వ్యతిరేకం కాదని… అయితే ఇలా నిరంకుశంగా ఆలయాలను ఇష్టానుసారం కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. హిందూదర్మం మీద చంద్రబాబు కక్ష కట్టినట్టుగా ఉందన్నారు. వందేళ్ల క్రితం నాటి ఆలయాలను, విగ్రహాలను ముక్కలుముక్కలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని కన్నా మండిపడ్డారు. అయినా కొందరు బీజేపీ నేతలు పిచ్చితనం కాకపోతే… ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబే స్వయంగా కూల్చిన ఆలయాలకు మరో చోట స్థలం ఇస్తారని చెప్పడం బట్టే చంద్రబాబుకు బీజేపీ ఏ రేంజ్‌లో దాసోహం అయిందో అర్థమైపోతోంది. సోమువీర్రాజు, కన్నా లాంటి వారు ఆభ్యంతరం వ్యక్తం చేసినంత మాత్రాన చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబోలు.
Click on Image to Read: