"టీడీపీలో మా సొంత నిర్ణయాలుండవు, ఆ పది మందిని ఆపుకోమనండి"
తమపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిస్మిస్ చేయడంపై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంబరపడ్డారు. స్పీకర్ నిర్ణయంపై తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో ఒక తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన జలీల్‌ఖాన్… వైసీపీ నుంచి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. అది కూడా రెండు వారాల్లోనే జరుగుతుందని వారిని రాకుండా వైసీపీ చూసుకుంటే చాలన్నారు. వైసీపీలో తమ అభిప్రాయాలకు విలువ లేకపోవడం, అవమానాల కారణంగానే బయటకు వచ్చాయని చెప్పారు. […]
తమపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిస్మిస్ చేయడంపై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంబరపడ్డారు. స్పీకర్ నిర్ణయంపై తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో ఒక తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన జలీల్‌ఖాన్… వైసీపీ నుంచి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. అది కూడా రెండు వారాల్లోనే జరుగుతుందని వారిని రాకుండా వైసీపీ చూసుకుంటే చాలన్నారు.
వైసీపీలో తమ అభిప్రాయాలకు విలువ లేకపోవడం, అవమానాల కారణంగానే బయటకు వచ్చాయని చెప్పారు. అంతలోనే జలీల్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లవచ్చు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… టీడీపీలో తమ వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని చెప్పారు. పార్టీయే తమ భవిష్యత్తు ఏమిటో నిర్ణయిస్తుందన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచాము కాబట్టే రెండేళ్ల పాటు ఆ పార్టీకి జవాబుదారిగా ఉన్నామని… మరో మూడేళ్లు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేందుకు పార్టీని వీడామని కొత్త విషయం చెప్పారు.
అమరావతి అన్నది ఒకటుందని ప్రపంచానికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు జలీల్ ఖాన్. మొత్తం మీద వైసీపీలో తమ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువలేదని చెప్పిన జలీల్ ఖాన్… రాజీనామా విషయంలో తమ వ్యక్తిగత నిర్ణయాలుండవని చెప్పడం ఆసక్తిగా ఉంది.
Click on Image to Read: