ముస్లింల నోట్లో కల్తీ నెయ్యి!... ఇది "ఈనాడు" కథనమే...
పవిత్రమైన రంజాన్ వేళ ముస్లింల నోట్లో కల్తీ నెయ్యి పోసేందుకు ప్రయత్నం జరిగింది. తోఫాలో వస్తువులన్నీ నాసికరమైనవి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే తోఫా నాసికరంగా ఉందంటూ ఈనాడు పత్రికే కథనం రాయడం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రంజాన్ తోఫాలో ఇస్తున్న గోధుమ పిండి నాసిరకమని తేలినట్టు ఈనాడు కథనాన్ని ప్రచురించింది. గోధుమ పిండిని జల్లెడ పట్టగా అర కిలో తవుడు వచ్చిందని వెల్లడించింది. చక్కెర కూడా సెకండ్ గ్రేట్ బ్రోకెన్ షుగర్ ఇస్తున్నట్టు ఆరోపణలు […]
పవిత్రమైన రంజాన్ వేళ ముస్లింల నోట్లో కల్తీ నెయ్యి పోసేందుకు ప్రయత్నం జరిగింది. తోఫాలో వస్తువులన్నీ నాసికరమైనవి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే తోఫా నాసికరంగా ఉందంటూ ఈనాడు పత్రికే కథనం రాయడం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రంజాన్ తోఫాలో ఇస్తున్న గోధుమ పిండి నాసిరకమని తేలినట్టు ఈనాడు కథనాన్ని ప్రచురించింది. గోధుమ పిండిని జల్లెడ పట్టగా అర కిలో తవుడు వచ్చిందని వెల్లడించింది. చక్కెర కూడా సెకండ్ గ్రేట్ బ్రోకెన్ షుగర్ ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయని సదరు పత్రిక చెబుతోంది. ఇక నెయ్యి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ప్రచురించింది.
100 గ్రాముల నెయ్యి ప్యాకెట్ ఇస్తుండగా కనీసం నెయ్యివాసన కూడా లేదట. కృష్ణా జిల్లాకు సరఫరా అయిన నెయ్యిని పరీక్షించగా అది కల్తీదని తేలిందని ఈనాడు కథనం. నెయ్యి గుట్టురట్టు అవడంతో దాన్నివెనక్కు పంపుతాయని అధికారులు తొలుత ప్రకటించారు. కానీ తర్వాత దాన్నే సరఫరా చేశారని ఈనాడుపత్రిక చెబుతోంది. మొత్తం మీద రంజాన్ తోఫా పేరుతో కల్తీ నెయ్యి, తవుడు కలిపిన గోధుమ పిండిని సరఫరా చేస్తున్నట్టు ఈనాడు పత్రికే ధృవీకరించడం విశేషం. ఇంతకాలం చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసే పత్రికలు చంద్రన్న కానుకలపై కథనాలు రాస్తే టీడీపీ నేతలు ఎదురుదాడి చేసేవారు.ఇప్పుడు ఈనాడు పత్రికే ముస్లింలకు కల్తీ నెయ్యి, తవుడు గోధుమ పిండి సరఫరా చేస్తున్నారని రాసింది. మరి దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో!. అయితే నెయ్యి కల్తీదనితేలిన మాట వాస్తవమేనని కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ధృవీకరించారు. వాటిని వెనక్కు తెప్పిస్తామని చెప్పారు. అయితే ఇలాంటి నెయ్యిని సరఫరా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం క్లారిటీ లేదు.
Click on Image to Read: