అనర్హత పిటిషన్ల తిరస్కరణ వెనుక అసలు కారణం అదేనంటున్న బుగ్గన

టీవీల్లో అందరూ చూస్తుండగానే పార్టీ ఫిరాయించిన 13 మంది వైసీపీఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడంపై వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ చైర్‌ గౌరవం రోజురోజుకు దిగజారిపోతోందని ఆవేదన చెందారు. ఫిరాయింపులకు సంబంధించి అన్ని సాక్ష్యాలను అందజేసిన తర్వాత కూడా పిటిషన్లలో గ్రామర్‌ తప్పు ఉంది, ఫుల్‌స్టాప్‌ లేదు, కామాలు లేవు అంటూ తిరస్కరించడం దారుణమన్నారు. పిటిషన్లను నిబంధనలకు విరుద్దంగా ఉంటే ఇంతకాలం స్పీకర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. […]

Advertisement
Update:2016-07-02 10:06 IST

టీవీల్లో అందరూ చూస్తుండగానే పార్టీ ఫిరాయించిన 13 మంది వైసీపీఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడంపై వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ చైర్‌ గౌరవం రోజురోజుకు దిగజారిపోతోందని ఆవేదన చెందారు. ఫిరాయింపులకు సంబంధించి అన్ని సాక్ష్యాలను అందజేసిన తర్వాత కూడా పిటిషన్లలో గ్రామర్‌ తప్పు ఉంది, ఫుల్‌స్టాప్‌ లేదు, కామాలు లేవు అంటూ తిరస్కరించడం దారుణమన్నారు.

పిటిషన్లను నిబంధనలకు విరుద్దంగా ఉంటే ఇంతకాలం స్పీకర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పిటిషన్ల తీవ్రతను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించారని మండిపడ్డారు. న్యాయం చెప్పాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఇదేనా అని బుగ్గన ప్రశ్నించారు. అసలు పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. రెండుపార్టీలను ఒకచోట కూర్చొబెట్టి అంశాన్ని పరిష్కరించాల్సిన స్పీకర్‌ అలా చేయకుండా ప్రెస్‌ ముందుకు వచ్చి పిటిషన్లను తిరస్కరిస్తున్నామని చెప్పడం ఇప్పటి వరకూ ఎక్కడా లేదన్నారు.

స్పీకర్‌ ఇలా పిటిషన్లను తిరస్కరించడం వెనుక మరో కారణముందన్నారాయన. ఫిరాయింపుదారులపై చర్యల జాప్యాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఇది వరకే వైసీపీ ఆశ్రయించిందన్నారు. ఈనెల 8న దానిపై విచారణ జరగనుందని … అనర్హత పిటిషన్లపై ఏంచర్యలు తీసుకున్నారని స్పీకర్‌ను సుప్రీం తప్పక ప్రశ్నిస్తుందన్న ఉద్దేశంతోనే అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారని బుగ్గన ఆరోపించారు. స్పీకర్‌ ఇలా చిన్నచిన్నతప్పులను చూపెట్టి పిటిషన్లను తిరస్కరిస్తారని తాము ముందే ఊహించామన్నారు. అందుకే అన్ని నిబంధనలు క్రాస్ చెక్ చేసుకుని మరో సెట్ పిటిషన్లు కూడా స్పీకర్‌కు ఇదివరకే ఇచ్చామన్నారు. వాటి ఆధారంగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News