"సాక్షి" దూకుడు తగ్గిందా?.. వీటిని ఎందుకు వదిలేశారో...

ఏపీలో అన్ని మీడియా సంస్థలు ఒక వైపు నిలిచాయి. సాక్షి మాత్రమే మరో వైపు నిలిచింది. చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడంతో పాటు జగన్‌కు అండగా ఉంటుందని వైసీపీ శ్రేణుల అభిప్రాయం. కానీ తెలిసి జరుగుతున్నాయో లేక తెలియక జరుగుతున్నాయో గానీ చంద్రబాబు అనుకూల మీడియాతో పోలిస్తే సాక్షి పత్రిక అంత దూకుడుగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ఉంది. జగన్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయగానే టీడీపీ అనుకూల మీడియా జడలు విప్పి నాట్యం చేస్తోంది. అటాచ్‌ చేసిన […]

Advertisement
Update:2016-07-01 05:55 IST

ఏపీలో అన్ని మీడియా సంస్థలు ఒక వైపు నిలిచాయి. సాక్షి మాత్రమే మరో వైపు నిలిచింది. చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడంతో పాటు జగన్‌కు అండగా ఉంటుందని వైసీపీ శ్రేణుల అభిప్రాయం. కానీ తెలిసి జరుగుతున్నాయో లేక తెలియక జరుగుతున్నాయో గానీ చంద్రబాబు అనుకూల మీడియాతో పోలిస్తే సాక్షి పత్రిక అంత దూకుడుగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ఉంది. జగన్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయగానే టీడీపీ అనుకూల మీడియా జడలు విప్పి నాట్యం చేస్తోంది.

అటాచ్‌ చేసిన ఆస్తుల్లో జగన్ ఇల్లు కూడా ఉండడంతో రకరకాల కథనాలు వండివారుస్తున్నాయి. అటాచ్‌ను ఏకంగా జప్తుగా తీర్మానించేశాయి. ఈ సమయంలోనే చంద్రబాబుకు దిమ్మతిరిగే రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందంటూ NCEAR రిపోర్ట్‌ తేల్చింది. ఏపీలో పరిశ్రమలుపెట్టాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని అక్కడ అవినీతే పెద్ద సమస్య అని 74శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారని రిపోర్టు బట్టబయలు చేసింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రచురించింది. కానీ సాక్షి దాన్ని అందుకోలేకపోవడం వైసీపీ శ్రేణులకు నిరాశే మిగిల్చినట్టుగాఉంది.

జగన్ ఆస్తుల అటాచ్‌పై యాగి చేస్తున్న చంద్రబాబు మీడియాకు NCEAR రిపోర్టు గట్టి కౌంటర్ అవుతుందనుకున్నారు. కానీ సాక్షి ఆ పనిచేయలేదు. అంతేకాదు. ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఏకంగా పాతికకుపైగా ఆలయాలను, గోశాలలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేయించింది. ఈ అంశాన్ని కూడా సాక్షి ప్రధాన పత్రికలో హైలైట్ చేయలేకపోయింది ఎందుకో!. ఒకవైపు అటాచ్ అనే అంశాన్ని పట్టుకుని చంద్రబాబు మీడియా జప్తు అంటూ హడావుడి చేస్తున్నా సాక్షి పత్రిక మాత్రం ఎంచక్కా నిన్న ఏం జరిగింది అన్న సాధారణ వార్తలతో సరిపెట్టుకుని సంతోషించింది. ఎంతైనా బాబు మీడియా బాబు మీడియానే.

చంద్రబాబు చైనా ప్రయాణాన్ని కూడా సాక్షి ప్రతినిధి దగ్గరుండి చూసినట్లుగా వార్తలు రాశారు. చంద్రబాబుకు డబ్బా కొడుతూ సీఎంఓ పంపిన పత్రికా ప్రకటనలను ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించారు. అంతేగానీ “సీఎంఓ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం”… అని ఎక్కడా రాయలేదు. ఎన్నివిమర్శలు వచ్చినా కొందరు సాక్షి ఉద్యోగులు చంద్రబాబు పై చెప్పలేని ప్రేమను ఇలా కనబరుస్తూనే వున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News