హైకోర్టు విభజనపై రేవంత్ రెడ్డి, లక్ష్మణ్‌లు నోరు మెదపరేం?
తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అవినీతిమయం అవుతోందని.. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇలా ప్రతిరోజూ టీడీపీ- బీజేపీ ద్వయం తెలంగాణ సర్కారును తూర్పార బడుతోంది. ఎక్కడ ఏ ప్రాజెక్టు తలపెట్టినా.. వీరు వాటిలో అక్రమాలు జరిగాయని మీడియా ముందు మైకులు విరిగేలా ఉపన్యాసాలు దంచుతున్నారు. మరి తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్, హైకోర్టు విభజనపై ఈ రెండుపార్టీలు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నసాగర్, పాలమూరు.. ఇలా ప్రభుత్వం ప్రకటించిన ప్రతి నీటిపారుదల […]
Advertisement
తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అవినీతిమయం అవుతోందని.. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇలా ప్రతిరోజూ టీడీపీ- బీజేపీ ద్వయం తెలంగాణ సర్కారును తూర్పార బడుతోంది. ఎక్కడ ఏ ప్రాజెక్టు తలపెట్టినా.. వీరు వాటిలో అక్రమాలు జరిగాయని మీడియా ముందు మైకులు విరిగేలా ఉపన్యాసాలు దంచుతున్నారు. మరి తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్, హైకోర్టు విభజనపై ఈ రెండుపార్టీలు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
మల్లన్నసాగర్, పాలమూరు.. ఇలా ప్రభుత్వం ప్రకటించిన ప్రతి నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో వీరు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే.. ఏకంగా దీక్షలే చేస్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అయితే..తెలంగాణ సర్కారుకు కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నా.. వాటిని ఏం చేస్తున్నారు? అని నిలదీస్తారు. వాస్తవానికి ఇటీవల ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు కూడా ఇదే పాటపాడి.. ఆర్థిక మంత్రి ఈటెల సమాధానంతో భంగపాటుకు గురయ్యారు. ఈ విషయంలో కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయ చొరవ అభినందనీయమనే చెప్పాలి. న్యాయాధికారుల పోరాటం, సస్పెన్షన్ విషయాన్ని ఆయనే స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లారు. తెలంగాణలో ఉన్న టీడీపీ- బీజేపీలు కనీసం ఈ మాత్రం చొరవ అయినా చూపకపోవడంపై న్యాయవాదులు, తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. మేం చేస్తోన్న పోరాటానికి కనీసం మద్దతు పలికేందుకు ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టి మద్దతు పలికే వీలులేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో కొంతలో కొంత.. కాంగ్రెస్ విధానం స్పష్టంగా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో విమర్శిస్తూనే.. హైకోర్టు విభజనలో తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. హైకోర్టు విభజన వెంటనే జరగాలని జానా, ఉత్తమ్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేసీఆర్ అలసత్వం ప్రదర్శించారని నిందిస్తూనే.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ- టీడీపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement