స్పీకర్‌ ప్రతిపక్షాలను అలా అనవచ్చా...

స్పీకర్‌గా ఎన్నికయ్యే వారు కూడా ఒక రాజకీమ పార్టీకిచెందిన వారే. కానీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలను సమదృష్టితో చూడాలని చెబుతుంటారు. ఒక ఇంటిపెద్దగా అన్ని పార్టీలను ట్రీట్ చేయాలని చెబుతుంటారు. అయితే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాత్రం ఈ విషయంలో పదేపదే విపక్షాల విమర్శలకు లోనవుతున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో పరోక్షంగా ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలనడం చర్చనీయాంశమైంది. రైతు […]

Advertisement
Update:2016-06-29 03:42 IST

స్పీకర్‌గా ఎన్నికయ్యే వారు కూడా ఒక రాజకీమ పార్టీకిచెందిన వారే. కానీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలను సమదృష్టితో చూడాలని చెబుతుంటారు. ఒక ఇంటిపెద్దగా అన్ని పార్టీలను ట్రీట్ చేయాలని చెబుతుంటారు. అయితే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాత్రం ఈ విషయంలో పదేపదే విపక్షాల విమర్శలకు లోనవుతున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మంగళవారం గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో పరోక్షంగా ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలనడం చర్చనీయాంశమైంది. రైతు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. లోటుబడ్జెట్ ఉన్నా రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని చెప్పారు. అర్హత కలిగిన ప్రతిరైతుకు లక్షన్నరవరకు రుణమాఫీ జరిగితీరుతుందని ప్రభుత్వం తరపున వెల్లడించారు. సీఎంను పొగడడంవరకు బాగానే ఉంది కానీ .. చంద్రబాబును ఎగతాళి చేసిన వారికి, మోసకారి, మాయలు చేస్తున్నాడని విమర్శించిన వారికి రైతులే బుద్ధి చెప్పాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.

స్పీకర్‌గా ఉంటూ ఇలా కొన్ని రాజకీయ పక్షాలపైకి తిరగబడండి అన్న రీతిలో పిలుపునివ్వడాన్ని ప్రతిపక్షం తప్పుపడుతోంది. అది కూడా పవిత్రమైన స్పీకర్‌ స్థానంలో ఉంటూ ఒక సీఎంను మరీ ఇలా పొగడడం బాగాలేదంటున్నారు. ఇప్పటికే కోడెల శివప్రసాదరావు మొన్నటి ఎన్నికల్లో తాను గెలిచేందుకు రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా చెప్పి సంచలనం సృష్టించారు.దానిపై వైసీపీ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద స్పీకర్‌ తీరు పదేపదే చర్చకు రావడం మంచిది కాదేమో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News