మైసూరాకు ముహూర్తం కుదిరింది

టిఫిన్‌కు పిలిచి కండువా కప్పారని ఆతర్వాత తనకుపార్టీలో అవమానాలు ఎదురయ్యాయంటూ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మైసూరారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారని ఒక ప్రముఖ పత్రిక కథనం. మైసూరారెడ్డి టీడీపీలో చేరడానికి పెద్దగా ఆలస్యం కూడా ఉండకపోవచ్చని వెల్లడించింది.ఇటీవల మైసూరారెడ్డి కుటుంబానికి చెందిన తేజ సిమెంట్ ఫ్యాక్టరీకి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో 140ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ 25లక్షలుండగా కేవలం ఎకరం రూ. […]

Advertisement
Update:2016-06-29 02:49 IST

టిఫిన్‌కు పిలిచి కండువా కప్పారని ఆతర్వాత తనకుపార్టీలో అవమానాలు ఎదురయ్యాయంటూ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మైసూరారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారని ఒక ప్రముఖ పత్రిక కథనం. మైసూరారెడ్డి టీడీపీలో చేరడానికి పెద్దగా ఆలస్యం కూడా ఉండకపోవచ్చని వెల్లడించింది.ఇటీవల మైసూరారెడ్డి కుటుంబానికి చెందిన తేజ సిమెంట్ ఫ్యాక్టరీకి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో 140ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ 25లక్షలుండగా కేవలం ఎకరం రూ. 2.5లక్షలకే కేటాయించారు. ఈభూమి కోసమే ఆయన వైసీపీని వీడారని కూడా చెబుతుంటుంటారు.

ప్రభుత్వం భూమి కేటాయించిన నేపథ్యంలో వెంటనే తేజ సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో శంకుస్థాపన ఉండవచ్చంటున్నారు. చంద్రబాబు చేతుల మీదుగానే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని కథనం. సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కంటే ముందుగానే మైసూరారెడ్డి టీడీపీ కండువా వేసుకుంటారని ప్రముఖ పత్రిక కథనం.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News