వైసీపీ మహిళా నేత రేప్‌కు మనిషిని పంపిన ఏపీ మంత్రి ఎవరు?

గుంటూరులో ఒక మహిళా నేతపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గుంటూరు పట్నంబజారులో ఉంటున్న వైసీపీ నాయకురాలు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ రేవతి ఇంటికి వచ్చిన వీరనారాయణ అనే వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాను పొలం అమ్మగా 20 కోట్లు వచ్చాయని నిన్ను ఎమ్మెల్యే చేస్తా అంటూ అత్యాచారయత్నం చేశాడు. అయితే రేవతి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. నెల రోజుల క్రితం కూడా వీరనారాయణ తన పట్ల ఇలాగే ప్రవర్తించాడని […]

Advertisement
Update:2016-06-28 03:57 IST

గుంటూరులో ఒక మహిళా నేతపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గుంటూరు పట్నంబజారులో ఉంటున్న వైసీపీ నాయకురాలు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ రేవతి ఇంటికి వచ్చిన వీరనారాయణ అనే వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాను పొలం అమ్మగా 20 కోట్లు వచ్చాయని నిన్ను ఎమ్మెల్యే చేస్తా అంటూ అత్యాచారయత్నం చేశాడు. అయితే రేవతి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు.

నెల రోజుల క్రితం కూడా వీరనారాయణ తన పట్ల ఇలాగే ప్రవర్తించాడని బాధితురాలు చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. వీరనారాయణను పోలీసులు విచారించగా తనను ఒక మంత్రి పంపిచారని చెప్పాడు. వైసీపీ నాయకురాలు రేవతి పరువు పోయేలా చేయాల్సిందిగా మంత్రిగారే పంపారని మీడియాతోనూ వెల్లడించారు. నెల క్రితమే మంత్రి తనకు ఈ పని అప్పగించారని వీరనారాయణ చెప్పాడు. కేవలం మంత్రి కోసమే తానీపని చేశానని చెప్పడంతో కలకలం రేగింది.

అయితే సదరు ఏపీ మంత్రి పేరును బయటకు రానివ్వడం లేదు. పట్టుబడిన నిందితుడు వీరనారాయణ గుంటూరు జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం లేమల్లెపాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. ఒక మహిళా నేతను దెబ్బకొట్టడానికి ఏకంగా ఆమె శీలంతోనే ఆడుకునేందుకు మంత్రి ప్రయత్నించడం నిజమే అయితే ఇది చాలా దారుణమైన విషయమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News