ఏపీ ముసోలినీ... తగిన మూల్యం చెల్లించుకుంటావ్...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇటీవల దీక్ష చేసిన కాపు నేత ముద్రగడను ఆయన సొంతూరు కిర్లంపూడిలో పరామర్శించిన అరుణ్‌కుమార్… చంద్రబాబును హిట్లర్, ముసోలినితో పోల్చారు. హిట్లర్‌, ముసోలినిలు ఉద్యమకారులను నిర్వీర్యం చేశారని ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారని విమర్శించారు. ముద్రగడనుకూడా మానసికంగా బలహీన పరిచేందుకు 13రోజుల పాటు ఆస్పత్రిలోనే చంద్రబాబు నిర్బంధించారని అన్నారు. రాజమహేంద్రవరాన్ని పాకిస్తాన్ సరిహద్దుగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఉండవల్లి మండిపడ్డారు. చంద్రబాబు తాను […]

Advertisement
Update:2016-06-28 11:29 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇటీవల దీక్ష చేసిన కాపు నేత ముద్రగడను ఆయన సొంతూరు కిర్లంపూడిలో పరామర్శించిన అరుణ్‌కుమార్… చంద్రబాబును హిట్లర్, ముసోలినితో పోల్చారు. హిట్లర్‌, ముసోలినిలు ఉద్యమకారులను నిర్వీర్యం చేశారని ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారని విమర్శించారు. ముద్రగడనుకూడా మానసికంగా బలహీన పరిచేందుకు 13రోజుల పాటు ఆస్పత్రిలోనే చంద్రబాబు నిర్బంధించారని అన్నారు. రాజమహేంద్రవరాన్ని పాకిస్తాన్ సరిహద్దుగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఉండవల్లి మండిపడ్డారు. చంద్రబాబు తాను చేసిన పనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. దీక్ష చేస్తున్న ముద్రగడకు కనీసం వార్తపత్రిక కూడా అందించకపోవడం దారుణమైన విషయం అన్నారు. ఒక విధంగా చంద్రబాబు చర్య ముద్రగడకే మంచి చేసిందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News