కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారు...

మొన్నటి ఎన్నికల ముందు వరకు తెలంగాణ ఉద్యమమంటే కేసీఆర్‌. కేసీఆర్‌ అంటేనే తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది తమతమ దారుల్లో పోరాటం చేసినా చివరకు మొత్తం క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడింది. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ చతికిలపడి కేసీఆర్‌ సీఎం అయ్యారు. అయితే ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రిగా మారిపోగానే ఆయనలో చాలా మార్పులు వచ్చాయని చెబుతుంటారు. ఏ ఆంధ్రా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా తెలంగాణ జనం పోరు చేశారో అదే కాంట్రాక్టర్లతో […]

Advertisement
Update:2016-06-28 06:06 IST

మొన్నటి ఎన్నికల ముందు వరకు తెలంగాణ ఉద్యమమంటే కేసీఆర్‌. కేసీఆర్‌ అంటేనే తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది తమతమ దారుల్లో పోరాటం చేసినా చివరకు మొత్తం క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడింది. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ చతికిలపడి కేసీఆర్‌ సీఎం అయ్యారు. అయితే ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రిగా మారిపోగానే ఆయనలో చాలా మార్పులు వచ్చాయని చెబుతుంటారు. ఏ ఆంధ్రా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా తెలంగాణ జనం పోరు చేశారో అదే కాంట్రాక్టర్లతో కేసీఆర్‌ కుటుంబం చెలిమి చేస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఒక విధంగా తనతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని కేసీఆర్ దాదాపు మరిచిపోయారని చెబుతుంటారు. అందుకే ఈ మధ్య కేసీఆర్ ను ఉద్యమనాయకుడిలా చాలా మంది భావించడం లేదు.

టీ లాయర్ల సమస్యనే తీసుకుంటే రెండేళ్లుగా వారు ప్రత్యేక హైకోర్టు కోసం, స్థానికుల నియామకాల కోసం పోరాటం చేస్తున్నారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి వారికి అందిన సహకారం అంతంతమాత్రమే. ఒక విధంగా కేసీఆర్‌పై ఆశలు వదులుకుని లాయర్లు సొంతంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏకంగా తాత్కాలిక సీజే బెంచ్‌ను బహిష్కరిస్తామని తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు ప్రకటించే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది.

ఇద్దరు న్యాయమూర్తులపైనా హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది కేసీఆర్‌ తీరుపై ఆలోచన చేశారు. తెలంగాణ ఉద్యమసమయంలో అన్నీ తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్‌… ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఎందుకు సరిగా స్పందించడం లేదన్న అనుమానం చాలా మందిలో ఏర్పడింది. ఒక విధంగా కోదండరాం చెప్పినట్టు కేసీఆర్‌ ప్రభుత్వం దారి తప్పిందా అన్న భావన కలిగింది. న్యాయవాదులు ఇప్పుడు ఏకంగా ఢిల్లీబాట పట్టడంతో కేసీఆర్‌ ఉలిక్కిపడ్డట్టుగా ఉన్నారు. తెలంగాణవాదులు కూడా తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చూడడం మానేస్తున్నారన్న అనుమానం వచ్చినట్టుంది.

అందుకే తెలంగాణ న్యాయవాదులంతా ఏకతాటిపైకి వచ్చి సొంతంగా పోరాటానికి సిద్ధమైన వేళ… ”నేను ఉన్నా” అంటూ ఒక ప్రతిక ప్రకటన ఇచ్చారు సీఎం. ఇప్పటికి ఎప్పటికీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ తానే ఉండాలని భావించే కేసీఆర్‌… ఇప్పుడు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసే యోచనలో ఉన్నట్టు లీక్ ఇచ్చారు. తెలంగాణ న్యాయవాదుల పోరు ఇంత దూరం వచ్చిన తర్వాత కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతోనూ గతంలోలాగే ఘాటు వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఒక విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలకు తానే నాయకుడినని ప్రకటించుకున్నారు కేసీఆర్. కోదండరాం లాంటి వారికి ఇప్పుడు కూడా చాన్స్‌ ఇవ్వకూడదన్న భావనతో స్పందించినట్టుగా ఉన్నారు. ఏదీ ఏమైనా హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు చేస్తున్న పోరుపై స్పందించే విషయంలో కేసీఆర్‌ ఆలస్యం చేసినట్టే ఉన్నారు. ఒకవేళ తానిప్పుడు సీఎం కాబట్టి ఇష్టానుసారం స్పందించడం కుదరదు కదా అని అనుకుంటే… అప్పుడు కేసీఆర్‌ ఉద్యమ సీఎం ఎలా అవుతారు?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News