అండర్-19 వరల్డ్ కప్ మలేసియాపై భారత్ ఘన విజయం
మలేసియా 31 రన్స్‌కే ఆలౌట్.. భారత బౌలర్ వైష్ణవి శర్మకు హాట్రిక్ వికెట్లు
Advertisement
అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. వెస్టిండీస్‌పై గెలిచి శుభారంభం చేసిన భారత్.. మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. మొదట భారత బౌలర్లు విజృంభించడంతో మలేసియా.. 14.3 ఓవర్లలో 31 రన్స్‌కే ఆలౌటైంది. మలేసియా బ్యాటర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. త్రి ష (27నాటౌట్), రాణించింది. భారత బౌలర్ వైష్ణవి శర్మ (5/5) సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నది. ఆమె ఈ మ్యాచ్‌లో హాట్రిక్ కూడా సాధించింది.
Advertisement