భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులో ఏపీ సీఎం వ్యాఖ్యలు

Advertisement
Update:2025-01-21 13:55 IST

భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు.

మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్న దశాబ్దాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్‌గేట్స్‌ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌, ఆర్థిక సంస్కరణలను ఉపయోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే తరహా సేవలు అందించాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉన్నది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News