ప్రకాశం జిల్లాలో ముగ్గురిని గొడ్డళ్లతో వెంటాడి చంపిన ప్రత్యర్థులు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నబొట్ల ఆగ్రహారంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా నరికి చంపారు. నడిరోడ్డుపై గొడ్డళ్లతో వెంటాడి నరికారు. మృతుల్లో దంపతులు జంగాబాబు, సుశీలతో పాటు రత్తయ్య అనే మరో వ్యక్తి ఉన్నారు. భూ తగాదాలే ఈ హత్యలకు కారణంగా భావిస్తున్నారు. నిందితులు బోస్, శ్యామ్‌సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు రుణమాఫీ పత్రాలు తీసుకునేందుకు హతులు ముగ్గురు గ్రామానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న […]

Advertisement
Update:2016-06-28 09:01 IST

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నబొట్ల ఆగ్రహారంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా నరికి చంపారు. నడిరోడ్డుపై గొడ్డళ్లతో వెంటాడి నరికారు. మృతుల్లో దంపతులు జంగాబాబు, సుశీలతో పాటు రత్తయ్య అనే మరో వ్యక్తి ఉన్నారు. భూ తగాదాలే ఈ హత్యలకు కారణంగా భావిస్తున్నారు. నిందితులు బోస్, శ్యామ్‌సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు రుణమాఫీ పత్రాలు తీసుకునేందుకు హతులు ముగ్గురు గ్రామానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బోస్‌, శ్యామ్‌సన్‌ వారిని వెంటాడి నరికిచంపారు. వీరంతా బంధువులేనని తెలుస్తోంది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ ప్రేమ్‌ కాజల్ పరిశీలించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News