అక్కా నీవే ప్రాణాలు కాపాడాలి...

(Jun 27, 2016) – అనంతపురం టీడీపీలో ఒక్కో లీడర్ ఒక్కో పవర్‌ సెంటర్‌గా తయారవుతున్నారు. ఇప్పటికే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జేసీ బ్రదర్స్ మధ్య బహిరంగంగానే పోరు నడుస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.  ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మంత్రి పరిటాల సునీత వర్గం మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇది ఏకంగా హత్యలకు స్కెచ్ వేసుకునే స్థాయికి వెళ్లింది.  అనంతపురం పరిధిలోని రుద్రంపేట,ఆత్మకూరు టీడీపీనేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా మంత్రి పరిటాల సునీతను […]

Advertisement
Update:2016-06-27 15:02 IST

(Jun 27, 2016) – అనంతపురం టీడీపీలో ఒక్కో లీడర్ ఒక్కో పవర్‌ సెంటర్‌గా తయారవుతున్నారు. ఇప్పటికే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జేసీ బ్రదర్స్ మధ్య బహిరంగంగానే పోరు నడుస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మంత్రి పరిటాల సునీత వర్గం మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇది ఏకంగా హత్యలకు స్కెచ్ వేసుకునే స్థాయికి వెళ్లింది. అనంతపురం పరిధిలోని రుద్రంపేట,ఆత్మకూరు టీడీపీనేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా మంత్రి పరిటాల సునీతను గత నెల 27న ఆశ్రయించారు.

రుద్రంపేట నాయకుడు రవీంద్రనాయక్‌ను హత్య చేసేందుకు స్వయంగా ప్రభాకర చౌదరియే కుట్రపన్నారంటూ ఆమెకు రుద్రంపేట, ఆత్మకూరు టీడీపీ కార్యకర్తలు వివరించినట్టు తెలుస్తోంది. ప్రభాకర్‌ చౌదరి ఆగడాల నుంచి తమను మీరే కాపాడాలని మంత్రి సునీతను వేడుకున్నారని సమాచారం. దీంతో పరిటాల, ప్రభాకర్‌ చౌదరి వర్గంగా టీడీపీ చీలిపోయినట్టు అయింది. పరిటాల రవి బతికున్నప్పుడు కూడా ఆయనకు ప్రభాకర్ చౌదరికి పడేది కాదు. 2004 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకుండా చేసింది కూడా పరిటాల రవి అని చెబుతుంటారు. ఆ సమయంలో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన ప్రభాకర్ చౌదరి కొద్దికాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పరిటాల, ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య సరైన సంబంధాలు లేవు.

మొన్నటి ఎన్నికల్లోనూ ప్రభాకర్‌ చౌదరికి జేసీ దివాకర్ రెడ్డి ఆర్థికంగా ఇతర విషయాల్లో అండగా నిలిచారని ప్రచారం ఉంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభాకర్ చౌదరి, జేసీ సోదరులకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. కొందరు టీడీపీ పెద్దలు… మనం మనం ఒకటి అన్న కోణంలో పరిటాల, ప్రభాకర్ చౌదరి మధ్య రాజీ కుదిర్చారని చెబుతుంటారు. కానీ అవి పెద్దగా ఫలితాన్నిఇచ్చినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు ఒకరి వర్గాన్ని మరొకరు టార్గెట్ చేసుకునే పరిస్థితులు వచ్చాయంటున్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News