గులాబీ పార్టీని వీడుతున్న ఎలిమినేటి?
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు క్యూ కడుతోంటే.. ఆపార్టీని వీడేందుకు ఓ నేత సిద్ధమయ్యారు. వివరాలు.. తెలంగాణ ఆవిర్భావం తరువాత టీఆర్ ఎస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పార్టీ పూర్తి రాజకీయ పార్టీగా మారింది. ఇందులో భాగంగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకించిన నేతలను కూడా ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటోంది. వారికి మంత్రి పదవులు కూడా కట్టబెడుతోంది. ఇది చాలామంది వ్యవస్థాపక సభ్యులకు, తెలంగాణవాదులకు, మేధావులకు […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు క్యూ కడుతోంటే.. ఆపార్టీని వీడేందుకు ఓ నేత సిద్ధమయ్యారు. వివరాలు.. తెలంగాణ ఆవిర్భావం తరువాత టీఆర్ ఎస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పార్టీ పూర్తి రాజకీయ పార్టీగా మారింది. ఇందులో భాగంగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకించిన నేతలను కూడా ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటోంది. వారికి మంత్రి పదవులు కూడా కట్టబెడుతోంది. ఇది చాలామంది వ్యవస్థాపక సభ్యులకు, తెలంగాణవాదులకు, మేధావులకు రుచించడం లేదు. ఈ పరిణామంపై పలువురు నాయకులకు అసంతృప్తి ఉన్నా..వారికి ఏదో ఒక నామినేటెడ్ పదవి రాకపోతుందా? అన్న ఆశతో.. ఎవరూ బయటపడటం లేదు. ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూలు కడుతోంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు నల్లగొండ జిల్లాలో కీలకంగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న వార్త జిల్లాలో కలకలం రేపుతోంది.
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే.. ఉత్తర తెలంగాణ కేంద్రంగా బలంగా ముందుకు సాగింది. కాలక్రమంలో తెలంగాణవ్యాప్తంగా విస్తరించింది. పార్టీని పెట్టిన తొలినాళ్లలో దక్షిణ తెలంగాణలో కేవలం మారుమూల ప్రాంతాలకు మాత్రమే పార్టీ పరిమితమైంది. అలాంటి జిల్లాలో నల్లగొండ కూడా ఒకటి. ఇక్కడ పార్టీ పెట్టిన కొత్తలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు కృష్ణారెడ్డి. గత 15 ఏళ్లుగా ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆయనను తీవ్ర కలతకు గురిచేసినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలైన తేరా చెన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్‌రావులకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో తనకు ఎలాంటి ప్రాధాన్యం కల్పించడం లేదని ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నారని తెలిసింది.
Advertisement