పవన్‌కు చంద్రబాబు సవాల్...

అమరావతికి భూములిచ్చేందుకు పలు గ్రామాల రైతులు తొలి నుంచి అభ్యంతరం చెప్పారు. ఒకదశలో ప్రభుత్వం నుంచి తమను కాపాడాలంటూ చంద్రబాబుకు మిత్రుడైన పవన్ కల్యాణ్‌ను రైతులు ఆశ్రయించారు. ఆయన వచ్చి రాజధాని ప్రాంతంలో పర్యటించి బలవంతంగా భూసమీకరణ చేయవద్దని చెప్పారు. దీంతో మిత్రపక్ష నాయకుడైన పవన్‌ చెప్పారు కాబట్టి బలవంతంగా భూములు లాక్కునే ప్రసక్తే లేదని మంత్రి నారాయణ కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తోనూ తలపడేందుకు చంద్రబాబు సిద్దపడినట్టుగా ఉంది. శనివారం అమరావతి రైతులకు ప్లాట్ల […]

Advertisement
Update:2016-06-26 03:09 IST

అమరావతికి భూములిచ్చేందుకు పలు గ్రామాల రైతులు తొలి నుంచి అభ్యంతరం చెప్పారు. ఒకదశలో ప్రభుత్వం నుంచి తమను కాపాడాలంటూ చంద్రబాబుకు మిత్రుడైన పవన్ కల్యాణ్‌ను రైతులు ఆశ్రయించారు. ఆయన వచ్చి రాజధాని ప్రాంతంలో పర్యటించి బలవంతంగా భూసమీకరణ చేయవద్దని చెప్పారు. దీంతో మిత్రపక్ష నాయకుడైన పవన్‌ చెప్పారు కాబట్టి బలవంతంగా భూములు లాక్కునే ప్రసక్తే లేదని మంత్రి నారాయణ కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తోనూ తలపడేందుకు చంద్రబాబు సిద్దపడినట్టుగా ఉంది. శనివారం అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించిన సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు… రైతులకు హెచ్చరిక జారీ చేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు సవాల్ విసిరారు.

”ఇప్పటికీ కొందరు రైతులు భూములు ఇవ్వడం లేదు. వారిని కొందరు రెచ్చగొట్టారు. వాళ్లొచ్చి కాపాడుతారని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఈ రోజు నుంచే భూసమీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్‌లోపు 2,500 ఎకరాలు ఖచ్చితంగా తీసుకుని తీరుతాం. ఎవరూ కాపాడలేరు” అని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో ఉంచుకుని చేసినవిగానే భావిస్తున్నారు. ఈ 2,500ల ఎకరాలు భూసమీకరణ కింద చంద్రబాబు తీసుకోకుండా ఆఖర్లో అడ్డుపడింది పవన్‌ కల్యాణే. పైగా భూముల జోలికి వస్తే ఆమరణ దీక్ష కూడా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు భూములు తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. అది కూడా అక్టోబర్‌లోపల తీసుకుంటాయని డెడ్‌లైన్‌ కూడా పెట్టారు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ బయటకు వస్తారా?. గతంలో చెప్పినట్టు రైతుల పక్షాన ఆమరణ దీక్ష చేస్తారా?.ఒక్కటి మాత్రం నిజమనిపిస్తోంది. కాపు ఓటు మీద ఆశలు తగ్గించుకున్న చంద్రబాబు మొన్న ముద్రగడను అణచివేశారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తోనూ తేల్చుకునేందుకు సిద్దపడినట్టే ఉన్నారు. ఇప్పుడు పవన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News