వచ్చే ఎన్నికల్లో బాబు గెలవరా? ఆ నిబంధన దేనికి సంకేతం..

స్విస్‌ చాలెంజ్ విధానంలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీల చేతుల్లో పెట్టేసింది ఏపీ ప్రభుత్వం. 58 శాతం సింగపూర్‌కు వాటా ఇచ్చి… ఏపీ ప్రభుత్వం మాత్రం 42శాతంతో సరిపెట్టుకుంది. ఒకవిధంగా రాజధానిపై ఏపీ ప్రభుత్వం కంటే సింగపూర్‌ కంపెనీలకే అధికారాలు ఎక్కువగా ఉండేలా చేశారు. చంద్రబాబు ఇంతటితో ఆగలేదు. సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మరో నిబంధన కూడా పెట్టారు. సింగపూర్‌ కంపెనీలకు అనుకూలంగా భవిష్యత్తులో ఏపీకి తీవ్ర నష్టంకలిగించేలా ఉందీ నిబంధన. ఒక వేళ భవిష్యత్తులో రాష్ట్రంలో […]

Advertisement
Update:2016-06-25 02:58 IST

స్విస్‌ చాలెంజ్ విధానంలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీల చేతుల్లో పెట్టేసింది ఏపీ ప్రభుత్వం. 58 శాతం సింగపూర్‌కు వాటా ఇచ్చి… ఏపీ ప్రభుత్వం మాత్రం 42శాతంతో సరిపెట్టుకుంది. ఒకవిధంగా రాజధానిపై ఏపీ ప్రభుత్వం కంటే సింగపూర్‌ కంపెనీలకే అధికారాలు ఎక్కువగా ఉండేలా చేశారు. చంద్రబాబు ఇంతటితో ఆగలేదు. సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మరో నిబంధన కూడా పెట్టారు.

సింగపూర్‌ కంపెనీలకు అనుకూలంగా భవిష్యత్తులో ఏపీకి తీవ్ర నష్టంకలిగించేలా ఉందీ నిబంధన. ఒక వేళ భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం మారి, సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందం రద్దు చేసుకోవాలనుకుంటే అందుకు భారీ మొత్తంలో నష్టపరిహారంగా ఏపీ ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధన పెట్టారు. నష్టపరిహారం నిబంధన ఉండాలని సింగపూర్ కంపెనీలు కోరాయని… సదరు నిబంధన చాలా బాగుందని ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఈనాడు పత్రికే ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం. అంటే ఒక విధంగా తాను ఉన్నా లేకున్నా సింగపూర్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరించారు.

ఇకపై రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న మాట. ఒకవేళ మనకు ఇష్టం లేదని చెబితే భారీగా నష్టపరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 2050వరకు తామే అధికారంలో ఉంటామని చెప్పే చంద్రబాబు, ఆయన కేబినెట్… ప్రభుత్వం మారితే ఒప్పందం రద్దు అయితే భారీ నష్టం పరిహారం చెల్లించాలన్న నిబంధన పెట్టడం దేనికి సంకేతమో.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News