ఆ కంపెనీల పరువేం కావాలి?- బాబు వార్నింగ్... సింగపూర్‌కు సీఎం వరాల జల్లు

ఏపీ రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం స్వీస్ చాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీకు అప్పగించింది.  ఈ మేరకే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు వరాలజల్లు కురిపించారు. అందరూ భయపడినట్టుగానే సింగపూర్‌ సంస్థలకు 58శాతం మెజారిటీ షేర్‌ను కట్టపెట్టారు. ఏపీప్రభుత్వం 42 శాతం వాటాతో సరిపెట్టుకుంది. మూడు విడతల్లో నిర్మాణాలుంటాయని చంద్రబాబు చెప్పారు. తొలుత 50 ఎకరాలను నామమాత్రపు ధరకు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. నామమాత్రపు ధర అంటే ఉచితమైనా కావచ్చని చంద్రబాబు చెప్పారు. 50 […]

Advertisement
Update:2016-06-24 10:14 IST

ఏపీ రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం స్వీస్ చాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీకు అప్పగించింది. ఈ మేరకే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు వరాలజల్లు కురిపించారు. అందరూ భయపడినట్టుగానే సింగపూర్‌ సంస్థలకు 58శాతం మెజారిటీ షేర్‌ను కట్టపెట్టారు. ఏపీప్రభుత్వం 42 శాతం వాటాతో సరిపెట్టుకుంది. మూడు విడతల్లో నిర్మాణాలుంటాయని చంద్రబాబు చెప్పారు. తొలుత 50 ఎకరాలను నామమాత్రపు ధరకు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. నామమాత్రపు ధర అంటే ఉచితమైనా కావచ్చని చంద్రబాబు చెప్పారు.

50 ఎకరాల్లో ఐకానిక్ బిల్డింగ్స్ వస్తాయన్నారు. మొత్తం 1691ఎకరాలను సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తామన్నారు. ఇసుక, మట్టి, విద్యుత్, డ్రెయినేజ్‌, వాటర్, సెక్యూరిటీ తదితర సదుపాయాలన్నీ ఏపీ ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. సీడ్ క్యాపిటల్ కు వెళ్లే రోడ్లను ఏపీ ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. విద్యుత్ టవర్లను కూడా ఏపీప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్నే రాజధాని కోసం ఎంపిక చేశామన్నారు. సింగపూర్‌ కంపెనీలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు.

అమరావతిపై మీడియాలో వస్తున్న వార్తలపై సీఎం ప్రెస్‌మీట్లో తీవ్రంగా స్పందించారు. తాము రాత్రిపగలు కష్టపడుతుంటే కొన్ని పత్రికలు లేనిపోని కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఇంట్లో కూర్చుని ఒక కలంపోటుతో ఇష్టానుసారం రాసేస్తారా అని ప్రశ్నించారు. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం కడుతుంటే కుంగిపోయిందంటూ రాయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

హైదరాబాద్‌తో 35ఏళ్ల అనుబంధం తెంచుకుని ఉద్యోగులు ఆనాథల్లా వచ్చి అమరావతితో ఉన్నారని దాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇలా కథనాలురాయడం నేరమని వాటిని ఎలా డీల్ చేయాలన్న దానిపైనా తాను సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయం కూలిందని రాస్తే ప్రతిష్టాత్మకమైన నిర్మాణ కంపెనీల పరువు ఏం కావాలని చంద్రబాబు ఆవేదన చెందారు. అమరావతితో అభద్రతభావాన్ని సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News