కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
ఈ మధ్యకాలంలో తాము అడిగితే.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ చేస్తోన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న పాలేరు ఉప ఎన్నిక సమయంలో అక్కడ టీఆర్ ఎస్ నుంచి పోటీ పెట్టవద్దని అభ్యర్థించేందుకు దివంగత ఎమ్మెల్యే సతీమణి సుచరితారెడ్డి, కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్‌లు సీఎం అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన తెలిపింది. ప్రతిపక్ష పార్టీ నేతలు అడిగితే కలిసేందుకు నిరాకరించడంపై ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా విమర్శించాయి. ఇటీవల ప్రజాకవి […]
Advertisement
ఈ మధ్యకాలంలో తాము అడిగితే.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ చేస్తోన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న పాలేరు ఉప ఎన్నిక సమయంలో అక్కడ టీఆర్ ఎస్ నుంచి పోటీ పెట్టవద్దని అభ్యర్థించేందుకు దివంగత ఎమ్మెల్యే సతీమణి సుచరితారెడ్డి, కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్‌లు సీఎం అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర నిరసన తెలిపింది. ప్రతిపక్ష పార్టీ నేతలు అడిగితే కలిసేందుకు నిరాకరించడంపై ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా విమర్శించాయి.
ఇటీవల ప్రజాకవి గూడ అంజయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆయన తన ఆఖరు రోజుల్లో ఎక్కువ సమయం నిమ్స్‌లో చికిత్స పొందుతూనే గడిపాడు. విషయం తెలిసిన కేసీఆర్ వైద్యానికి లోటురాకుండా ఆదేశించాడు. అయితే, గూడ అంజయ్య చివరి కోరిక మాత్రం తీర్చలేకపోయాడు. తనకు చనిపోయేముందు సీఎం కేసీఆర్ ని చూడాలని ఉందని ఆయన తన మనసులో మాట వెలిబుచ్చాడు. కానీ, కేసీఆర్ మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయాడు.
తాజాగా పలువురు రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ మేధావులు సైతం ఇటీవల సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారంట. ఈసారి కూడా సీఎం వారికి సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో కనీసం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరకడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం అపాయింట్‌మెంట్ దొరకక నిరాశపడుతున్న వాళ్ల విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు తనకు ఇష్టంలేని సమస్యలపై చర్చించేందుకు సుముఖత చూపడం లేదని ఒకవర్గం వారు అంటుంటే.. నిజంగానే ఆయనకు తీరికలేదని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు. అయితే, సీఎం కావాలనే కొందరిని దూరంగా పెడుతున్నారన్న ఆరోపణలు ఎక్కువవడం గమనార్హం.
Advertisement