మరో త్రీడీ బొమ్మ రెడీ... భారతీయులంతా సిగ్గుపడాల్సిందే
ప్రజలతో మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబును మించిన వారు లేరనిపిస్తోంది. రెండేళ్లు అవుతున్నా అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలు తప్ప ఏమీ నిర్మించలేకపోయిన చంద్రబాబు … త్రీడీ టెక్నాలజీతో మాత్రం నెలకో బొమ్మ చూపిస్తున్నారు. హైకోర్టు ఇలా ఉంటుంది. అసెంబ్లీ అలా ఉంటుంది, రోడ్లు గీత గీసినట్టు నేరుగా ఉంటాయంటూ త్రీడీ బొమ్మలతో, కొత్త కొత్త డిజైన్లతో జనాన్ని మురిపిస్తున్నారు. మొదట్లో అమరావతి త్రీడీ బొమ్మలను ఆసక్తిగా గమనించిన జనం ఇప్పుడు మాత్రం వాటిపై జోకులేసుకుంటున్నారు. అయితే […]
ప్రజలతో మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబును మించిన వారు లేరనిపిస్తోంది. రెండేళ్లు అవుతున్నా అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలు తప్ప ఏమీ నిర్మించలేకపోయిన చంద్రబాబు … త్రీడీ టెక్నాలజీతో మాత్రం నెలకో బొమ్మ చూపిస్తున్నారు. హైకోర్టు ఇలా ఉంటుంది. అసెంబ్లీ అలా ఉంటుంది, రోడ్లు గీత గీసినట్టు నేరుగా ఉంటాయంటూ త్రీడీ బొమ్మలతో, కొత్త కొత్త డిజైన్లతో జనాన్ని మురిపిస్తున్నారు.
సరే అమరావతి అంటే ప్రపంచస్థాయి రాజధాని అంటున్నారు కాబట్టి ఫారిన్ కంపెనీలతో డిజైన్ గీయిస్తే సర్దుకుపోవచ్చు. కానీ పుష్కర ఘాట్లకు సంబంధించిన డిజైన్లు కూడా చైనావాడితో గీయించారంటే ఇంకేమనాలి. అంటే ఘాట్లకు డిజైన్ చేసే స్థాయి కూడా మన తెలుగువారికి, భారతీయులకు లేదని చంద్రబాబు తేల్చేసినట్టుగా ఉన్నారు. మాటకు ముందు తెలుగు జాతి అని మాట్లాడే టీడీపీ ప్రభుత్వం… ఈ చైనా, జపాన్, సింగపూర్ జాతుల మీద ఆధారపడడం ఏ తరహా ఆత్మగౌరవమో!.
Click on Image to Read: