కేసీఆర్ మరీ అంత దిగజారారా?
రాష్ట్రంలో ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ స్వరం పెంచారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోన్నారని ధ్వజమెత్తారు. అప్పుడెప్పుడో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతుండటంతో కాంగ్రెస్ నేతలు క్రమంగా కారుపార్టీలోకి వరుస కడుతున్నారు. వీరిని ఆపడం ఎలాగో తెలియక ఉత్తమ్ సతమవుతున్నారు. అందుకే, ఇక ఉపేక్షించి లాభం లేదని మాటల దాడిని ముమ్మరం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోన్న కేసీఆర్ తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆయన తీరు కాంట్రాక్టులతో అక్రమంగా దోచుకో.. ఇతర పార్టీ […]
Advertisement
రాష్ట్రంలో ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ స్వరం పెంచారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోన్నారని ధ్వజమెత్తారు. అప్పుడెప్పుడో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతుండటంతో కాంగ్రెస్ నేతలు క్రమంగా కారుపార్టీలోకి వరుస కడుతున్నారు. వీరిని ఆపడం ఎలాగో తెలియక ఉత్తమ్ సతమవుతున్నారు. అందుకే, ఇక ఉపేక్షించి లాభం లేదని మాటల దాడిని ముమ్మరం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోన్న కేసీఆర్ తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆయన తీరు కాంట్రాక్టులతో అక్రమంగా దోచుకో.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కో అన్న చందంగా ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీరు ప్రలోభాలు పెట్టినంత మాత్రాన మా పార్టీకి వచ్చిన ఢోకా ఏంలేదని ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎంపీదాకా అందరినీ వివిధ ప్రయోజనాలతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ ఆయన దిగజారుడు రాజకీయాలు కాక మరేంటని ప్రశ్నించారు.
ఉత్తమ్ నాయకత్వంపై అసంతృప్తి!
ఓ వైపు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తున్న క్రమంలో మరోవైపు సొంతపార్టీ నాయకులే ఉత్తమ్ నాయకత్వంపై సందేహాలు లేవనెత్తుతున్నారు. పార్టీ మారుతున్నామంటూ.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రకటనలు చేసినా.. వారిని నిలువరించడంలో ఆయన విఫలమవుతున్నారని ఆయన వ్యతిరేక వర్గం చర్చించుకుంటోంది. సీనియర్ నాయకులను, కిందిస్థాయి కలుపుకొని పోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై అందరినీ ఒకతాటిపై నడపడటంతో ఆయన పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
Advertisement