ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు...
త్వరలోనే విశాఖ నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 11 మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి చూసిన తర్వాత, హుద్ హుద్ సమయంలో చంద్రబాబు పదిరోజులు బస్సులోనే ఉండి సిటీని సాధారణ స్థితికి తెచ్చిన విధానం చూసిన తర్వాత జీవీఎంసీ ఎన్నికల్లో విపక్షాలు పోటీ చేయకూడదన్నారు. ఒకవేళ పోటీ చేసినా ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు. కాబట్టి […]
త్వరలోనే విశాఖ నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 11 మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి చూసిన తర్వాత, హుద్ హుద్ సమయంలో చంద్రబాబు పదిరోజులు బస్సులోనే ఉండి సిటీని సాధారణ స్థితికి తెచ్చిన విధానం చూసిన తర్వాత జీవీఎంసీ ఎన్నికల్లో విపక్షాలు పోటీ చేయకూడదన్నారు. ఒకవేళ పోటీ చేసినా ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు. కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉండడమే విపక్షాలకు మంచిదన్నారు.
మేయర్ అభ్యర్థి ఎంపికలో తనకు మంత్రి అయ్యన్నపాత్రుడికి మధ్య విభేదాలు లేవన్నారు. ఎవరు ఏ ప్రాంతాలను చూసుకోవాలన్నది చంద్రబాబు క్లారిటీ ఇచ్చారన్నారు. విశాఖ సిటీని తనకు అప్పగించారని, విశాఖ రూరల్‌ను అయన్నపాత్రుడికి అప్పగించారని చెప్పారు. అరకు ప్రాంతాన్ని తాను చూసుకుంటానని… పాడేరుప్రాంతాన్ని అయ్యన్నపాత్రుడు చూసుకునేలా చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. మేయర్ ఎన్నికను ప్రత్యక్షపద్దతిలోనే నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Click on Image to Read: