జానారెడ్డి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా పేరొందిన జానారెడ్డి రాజకీయాల నుంచి త్వరలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇటీవలి కాలంలో ఆయన ఈ దిశగా ప్రయత్నాలు సాగించినట్లు కొన్నిచోట్ల ప్రచారం జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లాకే కాకుండా మొత్తం తెలంగాణలో సీనియర్ నాయకుడిగా, రాజకీయ చాణక్యుడిగా పేరొందిన జానారెడ్డి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసున్నారన్న విషయంపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు జానాకు రిటైర్మెంట్ ఆలోచన ఎందుకు వచ్చింది? అన్న విషయం అర్థంకాక […]
Advertisement
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా పేరొందిన జానారెడ్డి రాజకీయాల నుంచి త్వరలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇటీవలి కాలంలో ఆయన ఈ దిశగా ప్రయత్నాలు సాగించినట్లు కొన్నిచోట్ల ప్రచారం జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లాకే కాకుండా మొత్తం తెలంగాణలో సీనియర్ నాయకుడిగా, రాజకీయ చాణక్యుడిగా పేరొందిన జానారెడ్డి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసున్నారన్న విషయంపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు జానాకు రిటైర్మెంట్ ఆలోచన ఎందుకు వచ్చింది? అన్న విషయం అర్థంకాక నాయకులంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పార్టీకి విధేయుడిగా ఉంటూనే.. కేసీఆర్ ఉద్యమానికి మద్దతు పలికారు. కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా.. తెలంగాణ ఇవ్వాల్సింది తామేనని, తప్పకుండా ఇస్తామని పార్టీపరంగా ఎలాంటి అపవాదు రాకుండా కాపాడుకోవడంలో సఫలీకృతం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. తప్పకుండా ఆయనే సీఎం అయ్యేవారు. అందులో అనుమానమే లేదు. అయితే, ఫలితాలు తారుమారయ్యాయి. కారుజోరుకు కాంగ్రెస్ చతికిల బడింది. పైగా అసెంబ్లీలో ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తూనే.. వాటిలోని లోపాలను సునిశతంగా ఎత్తి చూపడంలో జానారెడ్డి తనదైన మార్కు కనబరిచారు. ప్రభుత్వం కూడా జానా రెడ్డి సూచనలకు పలుమార్లు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపింది. ఒక సందర్భంలో జానారెడ్డిని విమర్శించిన కేటీఆర్ కు జానా స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “మీ అయ్య నా ఆఫీసు ముందు నిలబడేవాడు.. గతం మరిచిపోయి మాట్లాడకు!” అంటూ మీడియాముందు హెచ్చరించారు. అయినా టీఆర్ ఎస్ నాయకులు జానా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. ఎంతైనా కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ కదా! జానారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం మీడియాకు లీకులు ఇవ్వడం మొదలు పెట్టింది. దురదృష్టవశాత్తూ.. ఈ క్రమంలో జానాను సమర్థించే నాయకులు తక్కువయ్యారు.
ఇటీవల ఆయన టీఆర్ ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో ఓసారి నేరుగా సోనియానే ఆయన ను ప్రశ్నించారని తెలిసింది. అయినప్పటికీ ఈ వార్తలు ఆగలేదు. ఆయన ఇటీవల అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, రాజ్యసభ సీటు కూడా అడిగారని వార్తలు వెలువడ్డాయి. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తరువాత ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారని, తన రాజకీయవారసుడిగా ఆయన కుమారుడిని ప్రకటించారన్న వార్తలు జోరందుకున్నాయి. వీటిపై జానారెడ్డి స్పందిస్తారో..? లేకుంటే.. మౌనంగానే ఉంటారా? వేచి చూడాలి.
Advertisement