ముద్రగడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది....
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష 11 వరోజుకు చేరింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వియ్యంకుడు సోమేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకూ ఉదాసీనంగా ఉన్న డాక్టర్లు ఇప్పుడు కంగారుపడుతున్నారని ఆయన చెప్పారు. ముద్రగడను ఏ ఆస్పత్రికి తరలించాలో చెప్పాలంటూ డాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ప్రస్తుతం ముద్రగడ 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మంది విడుదల కోసం […]
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష 11 వరోజుకు చేరింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వియ్యంకుడు సోమేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకూ ఉదాసీనంగా ఉన్న డాక్టర్లు ఇప్పుడు కంగారుపడుతున్నారని ఆయన చెప్పారు. ముద్రగడను ఏ ఆస్పత్రికి తరలించాలో చెప్పాలంటూ డాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ప్రస్తుతం ముద్రగడ 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు.
తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మంది విడుదల కోసం ముద్రగడ దీక్షకు దిగారు. ఇప్పటి వరకు కొందరికి బెయిల్ వచ్చింది. మరికొందరు విడుదల కావాల్సి ఉంది. అరెస్ట్ అయిన వారంతా బయటకు వచ్చేంత వరకు తాను దీక్ష విరమించనని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కోర్టు మీదే భారం వేసి మౌనంగా ఉన్నట్టు భావిస్తున్నారు. నిందితులకు కోర్టు బెయిల్ ఇస్తే అటోమెటిక్‌గా ముద్రగడే దీక్ష విరమిస్తారన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు భావిస్తున్నారు.
Click on Image to Read: