సారీసార్... మళ్లీ ఆ తప్పు చేయను.. అవునా! అదీ చూస్తా...
ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా తయారైంది ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీరు. ఆయన చేస్తున్న హల్‌చల్ చూసి తోటి టీడీపీ ఎమ్మెల్యేలే అవాక్కవుతున్నారు. అధికారులను కూడా జలీల్‌ఖాన్ లెక్కచేయడంలేదు. తాజాగా విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు జలీల్ ఖాన్. తాను చెప్పినట్టు టీచర్ల బదిలీలు చేయాలని సూచించగా అందుకు వారు నిరాకరించడంతో జలీల్‌ఖాన్‌కు కోపం వచ్చేసింది. నగరపాలక సంస్థ పాఠశాలల్లో టీచర్ల బదిలీలు జరగనున్న నేపథ్యంలో జలీల్‌ఖాన్… కొందరు టీచర్లను వెంటబెట్టుకుని వెళ్లి […]
ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా తయారైంది ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీరు. ఆయన చేస్తున్న హల్‌చల్ చూసి తోటి టీడీపీ ఎమ్మెల్యేలే అవాక్కవుతున్నారు. అధికారులను కూడా జలీల్‌ఖాన్ లెక్కచేయడంలేదు. తాజాగా విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు జలీల్ ఖాన్. తాను చెప్పినట్టు టీచర్ల బదిలీలు చేయాలని సూచించగా అందుకు వారు నిరాకరించడంతో జలీల్‌ఖాన్‌కు కోపం వచ్చేసింది.
నగరపాలక సంస్థ పాఠశాలల్లో టీచర్ల బదిలీలు జరగనున్న నేపథ్యంలో జలీల్‌ఖాన్… కొందరు టీచర్లను వెంటబెట్టుకుని వెళ్లి కమిషనర్‌ను కలిశారు. వారందరికీ తాము చెప్పిన స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. కమిషనర్ ఈ విషయమై విద్యాశాఖ ఇన్‌చార్జ్, అదనపు కమిషనర్ అరుణకుమార్‌ను పిలిపించి ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడించారు. జలీల్‌ఖాన్‌ను చూడగానే అరుణ్ కుమార్ ”సారీ సర్… మీరుచెప్పినట్టు చేయడం కుదరదు. గతంలో మీరు చెప్పింది ఒకటి చేశా… ఆ తప్పు మరోసారి చేయలేనని అందరి ముందే తేల్చిచెప్పారు. ఉద్యోగుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయని సిఫార్సులను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదు” అని చెప్పేశారు. దీంతో తన వెంట వచ్చిన టీచర్ల సమక్షంలో ఎమ్మెల్యే పరువు పోయింది. అరుణ్ కుమార్ చెప్పిన సమాధానంతో కంగుతిన్న జలీల్ ఖాన్ ”చూస్తా.. అదీ చూస్తా.. నా మాట కాదని బదిలీలు ఎలా చేస్తారో” అంటూ ఆగ్రహంతో వెళ్లిపోయారు.
ఉద్యోగుల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని చెబుతున్నా… అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి భారీగా సిఫార్సు లేఖలు అందుతుండడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా బదిలీల ప్రక్రియ ముగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జలీల్ ఖాన్ చేస్తున్న హడావుడిపై అధికారపార్టీ వారే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Click on Image to Read: