సాక్షి చర్చలో బట్టలు చించుకున్న కుటుంబరావు

అగ్రిగోల్డ్‌ బాధితులు చంద్రబాబు ప్రభుత్వ తీరుతో సతమతమైపోతున్నారు. అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసిన దాదాపు 42 లక్షల మంది ఖాతాదారులు రోడ్డునపడ్డారు. నిత్యం ధర్నాలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కారణం టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు అగ్రిగోల్డ్‌తో కుమ్మక్కు అవడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. నారా లోకేష్‌పైనా భారీగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ సమస్యపై ఒక ఛానల్‌లో చర్చాకార్యక్రమం నిర్వహించారు. చర్చలో పాల్గొన్న ఏపీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. […]

Advertisement
Update:2016-06-17 05:34 IST

అగ్రిగోల్డ్‌ బాధితులు చంద్రబాబు ప్రభుత్వ తీరుతో సతమతమైపోతున్నారు. అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసిన దాదాపు 42 లక్షల మంది ఖాతాదారులు రోడ్డునపడ్డారు. నిత్యం ధర్నాలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కారణం టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు అగ్రిగోల్డ్‌తో కుమ్మక్కు అవడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. నారా లోకేష్‌పైనా భారీగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ సమస్యపై ఒక ఛానల్‌లో చర్చాకార్యక్రమం నిర్వహించారు. చర్చలో పాల్గొన్న ఏపీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. బాధితుల పక్షాన కాకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం వైపు వకాల్తా తీసుకుని ఆయన మాట్లాడిన తీరును చర్చలో పాల్గొన్న మిగిలినవారంతా తప్పుపట్టారు.

చంద్రబాబుకు అగ్రిగోల్డ్ వ్యవహారంలో 200 కోట్లు ముడుపులు ముట్టాయని, మంత్రులు స్వయంగా అగ్రిగోల్డ్ భూములను తక్కువ ధరకు సొంతం చేసుకున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. మూడు వేల కోట్లను హవాలా మార్గంలో తరలించారని ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌ బాబు ఆరోపించారు. దీంతో వెంటనే ఫోన్ లైన్లోకి వచ్చిన కుటుంబరావు… లక్ష్మీపార్వతి, రమేష్‌ బాబుపై ఓ రేంజ్‌లో ఎదురుదాడి చేశారు. గాలి మాటలు మాట్లాడవద్దు, రోడ్ల మీద మాట్లాడే మాటలను టీవీల్లోకి వచ్చి మాట్లాడవద్దు అంటూ హెచ్చరించారు. ఆధారాలుంటే ఇవ్వండి అంతేగానీ ఇష్టానుసారం మాట్లాడవద్దు అని మండిపడ్డారు. అంతేకాదు…. అగ్రిగోల్డ్ యాజమాన్యం మూడు వేల కోట్లను హవాలా మార్గంలో తరలించిందన్న అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షుడిపైనా కుటుంబరావు విచిత్రంగా విరుచుకుపడ్డారు. హవాలా మార్గంలో డబ్బులు వెళ్లాయని ఎలా ఆరోపిస్తారంటూ మండిపడ్డారు.

దీంతో చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్‌, ఇతర సభ్యులు జోక్యం చేసుకున్నారు. అసలు బాధితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు… అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరపున మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. లక్షల మంది రోడ్డున పడి ఆందోళన చేస్తున్న సమస్యపై మాట్లాడుతుంటే.. గాలి మాటలు, రోడ్లమీద మాట్లాడుకునే మాటలని ఎలా అంటారని నిలదీశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఆరోపణలు చేస్తుంటే కుటుంబరావు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే రాజకీయపక్షాలు జోక్యం చేసుకోవద్దని, అనవసర రాద్దాంతం, విమర్శలు చేయవద్దని కుటుంబరావు సరికొత్త సూచన చేశారు. దీనిపైనా చర్చలో పాల్గొన్న ఇతరులు అభ్యంతరం చెప్పారు. లక్షలమంది రోడ్డు మీదకు వచ్చి ఈ స్థాయిలో ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం… ఇక మౌనంగా ఉంటే న్యాయం చేస్తుందా అని నిలదీశారు. మొత్తం మీద కుటుంబరావు మాట్లాడిన తీరు అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర ఆగ్రహాన్నే కలిగించి ఉంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News