కాపు చరిత్ర ఎరుగని అవమానం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం కాపు. టీడీపీని భుజాన వేసుకుని మొన్నటి ఎన్నికల్లో గెలిచిపించిన‌ వర్గం. ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. చంద్రబాబు చేసిన పనికి తామెక్కడున్నామో కూడా తెలుసుకోలేని అవమానకర స్థితిలో కాపులున్నారు. అవమానించడమే కాకుండా… కాపుల శక్తిసామర్థ్యాలకే చంద్రబాబు సవాల్ విసరడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కాపుల ఆరాధ్యదైవం వంగవీటి రంగా హత్య గురించి తెలిసినా మొన్నటి ఎన్నికల్లో కాపులంతా చంద్రబాబుకు జైకొట్టారు. పవన్‌ కల్యాణ్‌ మాటలు నమ్మి మూకుమ్మడిగా ఓటేశారు. కానీ […]

Advertisement
Update:2016-06-17 07:56 IST

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం కాపు. టీడీపీని భుజాన వేసుకుని మొన్నటి ఎన్నికల్లో గెలిచిపించిన‌ వర్గం. ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. చంద్రబాబు చేసిన పనికి తామెక్కడున్నామో కూడా తెలుసుకోలేని అవమానకర స్థితిలో కాపులున్నారు. అవమానించడమే కాకుండా… కాపుల శక్తిసామర్థ్యాలకే చంద్రబాబు సవాల్ విసరడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కాపుల ఆరాధ్యదైవం వంగవీటి రంగా హత్య గురించి తెలిసినా మొన్నటి ఎన్నికల్లో కాపులంతా చంద్రబాబుకు జైకొట్టారు. పవన్‌ కల్యాణ్‌ మాటలు నమ్మి మూకుమ్మడిగా ఓటేశారు. కానీ ఇప్పుడు కాపులకు చంద్రబాబు సాంఘిక బహిష్కరణ విధించారు. అచ్చం పెదరాయుడు సినిమాలో లాగా చేశారు.

ముద్రగడను ఆయన కుటుంబసభ్యులను కొట్టిలాక్కెళ్లి ఆస్పత్రిలో పడేయడమే కాకుండా ఆయన దీక్షకు సంబంధించిన వార్తలను కూడా బయటకు రాకుండా చేశారు. ఇదే కాపులకు తాను విధించిన శిక్ష అని పరోక్షంగా తెలిసేలా చేసిన చంద్రబాబు… పెదరాయుడు సినిమాలోలాగే కాపుల ఉద్యమానికి సహకరించిన వారికీ ఇదే శిక్ష అని తేల్చేశారు. అందుకే చంద్రబాబు అనుకూల మీడియా చానళ్లు అసలు ముద్రగడ దీక్ష గురించి గానీ, కాపుల ఆందోళన గురించి కూడా ఒక్కవార్త ఇవ్వడం లేదు. ముద్రగడ దీక్ష కవరేజ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించిన‌ సాక్షి చానల్ పై నయా పెదరాయుడు శిక్ష విధించారు. స్టేట్లో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. అసలు చంద్రబాబుకు వస్తున్న సొంతాలోచనో లేక బుర్రలేని సలహాదారులు ఇస్తున్న ఐడియాలో గానీ చంద్రబాబు చేసిన తప్పు చాలా దూరం వెళ్లేలా ఉంది.

ఒక తోటి సామాజికవర్గానికి తమ నేత దీక్ష వార్తలు కూడా తెలుసుకునే అవకాశం లేకుండా బహిష్కరించడం, ఈ వర్గాన్ని తొక్కివేయడం టీడీపీకి, చంద్రబాబుకు ఆనందంగానే ఉండవచ్చు. కానీ ఇది సమాజానికి మంచిదికాదు. కులాల మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లేలా చేసే దుస్సాహం ఇది. ప్రపంచంలో చాలా మంది నియంతలు కొన్ని వర్గాలను, కొన్ని సమూహాలను ఏళ్ల తరబడి అణచివేయగలిచారు. కానీ చివరకు తిరుగుబాటుకు గురై నియంతలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కాపుల డిమాండ్లు, ముద్రగడ దీక్షలో హేతుబద్ధత ఎంతుందన్నది పక్కన పెట్టినా ఇలా అనుకూల మీడియా ఉంది కదా అని వారి వార్తలపైనా బహిష్కరణ విధించడం మాత్రం భవిష్యత్తును తీవ్ర ప్రభావితం చేసే అవకాశమే ఉంటుంది. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు కోరితే ప్రభుత్వం వెంటనే కాపులపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తే అందరికీ మంచి జరుగుతుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News