అంతా మీ కులం వారే ఉండాలా?- యనమల వియ్యంకుడికి లోకేష్ క్లాస్!

కడప జిల్లా మైదుకూరు టీడీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ యాదవ్ తీరుపై పలువురు టీడీపీ నేతలు అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కావడంతో ఏ-వన్ కాంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ కొద్దికాలంగా నియోజకవర్గ టీడీపీలో అధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఏ టీడీపీ నాయకుడిని లెక్కచేయడంలేదని తమ్ముళ్ల ఆరోపణ. వియ్యంకుడి అండతో సుధాకర్ యాదవ్ కుల రాజకీయాలు […]

Advertisement
Update:2016-06-16 09:56 IST

కడప జిల్లా మైదుకూరు టీడీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ యాదవ్ తీరుపై పలువురు టీడీపీ నేతలు అధిష్టానికి ఫిర్యాదు చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కావడంతో ఏ-వన్ కాంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ కొద్దికాలంగా నియోజకవర్గ టీడీపీలో అధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఏ టీడీపీ నాయకుడిని లెక్కచేయడంలేదని తమ్ముళ్ల ఆరోపణ. వియ్యంకుడి అండతో సుధాకర్ యాదవ్ కుల రాజకీయాలు నడుపుతున్నారని తమ్ముళ్లు మండిపడుతున్నారు.

మైదుకూరు నియోజకవర్గంలో 70 శాతం ఉద్యోగులను తన సామాజిక వర్గానికి చెందిన వారినే సుధాకర్ యాదవ్ తెచ్చిపెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. జగన్‌ మీద కోపంతో మొన్నటి ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి కూడా సుధాకర్ యాదవ్‌కు సపోర్టు చేశారు. కానీ ఆయన గెలవలేకపోయారు. ఇప్పుడు డీఎల్ టీడీపీలోకి వచ్చేందుకు చేస్తున్నప్రయత్నాలను కూడా సుధాకర్ యాదవ్ అడ్డుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఇలా ప్రతివిషయంలోనూ సుధాకర్ యాదవ్ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారంటూ ఆయన వ్యతిరేకులు వెళ్లి లోకేష్‌ బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్ యాదవ్‌ను పిలిపించుకున్న లోకేష్… తీవ్రస్థాయిలో ఇతర నాయకుల ముందే క్లాస్ పీకారని చెబుతున్నారు.

నియోజవకర్గంలో మొత్తం మీ కులం వాళ్లే ఉండాలా?. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు మీ సామాజికవర్గం వారే ఉండాలా అంటూ ముఖం మీద అడిగేశారట. అంతే కాదు నీవు గెలిచేందుకు 30 శాతం కూడా అవకాశం లేదని రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయంటూ అందరి ముందే యనమల వియ్యంకుడి పరువును లోకేష్ తీసేశారని చెబుతున్నారు. దీంతో నొచ్చుకున్న సుధాకర్ యాదవ్ కొద్ది రోజులుగా పార్టీకార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదని చెబుతున్నారు. ఈ విషయం యనమల రామకృష్ణుడికి చెప్పుకుని సుధాకర్ యాదవ్ వాపోయారని సమాచారం. అయితే లోకేష్‌కు యనమల రామకృష్ణుడు అంటే కూడా పడడం లేదని చెబుతున్నారు. వీరి మధ్య చాలా కాలంగానే గ్యాప్ ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News