రూ. 200 కోట్ల ముడుపులు అందాయి...

అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఏపీప్రభుత్వం కొమ్ముకాస్తోందంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సీఐడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ సీఐడీ డౌన్ డౌన్ అంటూనినాదాలు చేశారు. బాధితులకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడిన వైసీపీనాయకురాలు లక్ష్మీపార్యతి …చంద్రబాబు తీరుతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని… చినబాబు, పెదబాబు కలిసి 200 కోట్ల ముడుపులు తీసుకుని అగ్రిగోల్డ్ […]

Advertisement
Update:2016-06-16 09:13 IST

అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఏపీప్రభుత్వం కొమ్ముకాస్తోందంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సీఐడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ సీఐడీ డౌన్ డౌన్ అంటూనినాదాలు చేశారు. బాధితులకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడిన వైసీపీనాయకురాలు లక్ష్మీపార్యతి …చంద్రబాబు తీరుతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని… చినబాబు, పెదబాబు కలిసి 200 కోట్ల ముడుపులు తీసుకుని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసు కోర్టులో నడుస్తుండగానే అగ్రిగోల్డ్ భూములను మంత్రులు కొనుగోలు చేయడం దారుణమైన చర్య అని అన్నారు.

వాస్తు పేరుతో గెస్ట్ హౌజ్‌లు. సెవెన్ సార్ట్ హోటళ్లకు వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్న చంద్రబాబు… 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.. చంద్రబాబుపై ప్రజల్లో ఎలాగో నమ్మకంపోయిందని కనీసం కేసీఆర్‌ అయినా సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని కోరారామె. తమ కుటుంబాలను నాశనం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యం, వారికి వంతపాడుతున్న ప్రభుత్వ పెద్దలకు అగ్రిగోల్డ్ బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News