కోర్టును ఆశ్రయించిన సాక్షి

ఏపీలో ఛానల్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించడంపై సాక్షి టీవీ హైకోర్టును ఆశ్రయించింది. ఎంఎస్‌ఓలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలంటూ సాక్షి సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్‌లను ప్రతివాదులుగా చేర్చింది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో […]

Advertisement
Update:2016-06-15 03:04 IST

ఏపీలో ఛానల్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించడంపై సాక్షి టీవీ హైకోర్టును ఆశ్రయించింది. ఎంఎస్‌ఓలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలంటూ సాక్షి సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్‌లను ప్రతివాదులుగా చేర్చింది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని తన పిటిషన్‌లో ఆయన న్యాయస్థానాన్ని పిటిషనర్ అభ్యర్థించారు. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.

ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏదైనా టీవీ ప్రసారాల్ని నిలిపేయాలంటే మూడు వారాలముందు నోటీసులు జారీ చేసి, తగిన కారణాలను వివరించాల్సి ఉందన్నారు. ప్రసారాలు నిలిపివేస్తున్న విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియచేయాల్సి ఉందన్నారు. అయితే సాక్షి విషయంలో ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ఏపీలో కక్షపూరితంగానే సాక్షిప్రసారాలను నిలిపివేశారని పిటిషనర్ ఆరోపించారు. అయితే కోర్టు చెప్పినంత మాత్రాన ఆ ఆదేశాలను పాటించే స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందా అన్నదే ఇప్పుడు అందరి అనుమానం. రాజ్యాంగాన్ని కూడా తుంగలోతొక్కి పాలిస్తున్న చంద్రబాబు కోర్టు తీర్పులను లెక్క చేస్తారా?. ఒకవేళ పైకి కోర్టు ఇచ్చే తీర్పును ఆచరిస్తామని చెప్పినా … నిజాయితీగా చంద్రబాబు చేస్తారా అన్న దానికి ఆయన వ్యక్తిత్వమే సాక్ష్యంగా నిలుస్తుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News