కులాల కురుక్షేత్రంగా మారుస్తున్నారు... బాబును దగ్గరగా చూశా, ఏమైందో అర్థం కావడం లేదు

ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనబాట పట్టారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గవర్నర్‌ను కలిసి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని రాష్ట్రంలో రాజ్యాంగ పెద్దగా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను జర్నలిస్టులు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఇలా ఛానళ్లను అడ్డుకోవడం చంద్రబాబుకు కొత్తగా పుట్టిన బుద్దికాదని అమర్‌ మండిపడ్డారు. ప్రెస్ […]

Advertisement
Update:2016-06-15 09:17 IST

ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనబాట పట్టారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గవర్నర్‌ను కలిసి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని రాష్ట్రంలో రాజ్యాంగ పెద్దగా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను జర్నలిస్టులు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఇలా ఛానళ్లను అడ్డుకోవడం చంద్రబాబుకు కొత్తగా పుట్టిన బుద్దికాదని అమర్‌ మండిపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఇప్పటికే చంద్రబాబుకు అనేకసార్లు చివాట్లు పెట్టిందన్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రే స్వయంగా తామే సాక్షిఛానల్‌ను నిలిపివేశామని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు… చంద్రబాబు తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. కాపు సామాజికవర్గానికి సంబంధించిన వార్తలు ప్రసారం కాకుండా అడ్డుకోవడం దారుణమైన చర్య అన్నారు. చంద్రబాబు తెలివిగా చేస్తున్నారో తెలివితక్కువగా చేస్తున్నారో లేక అతి తెలివితో చేస్తున్నారో గానీ ఆయన చర్యల వల్ల రాష్ట్రం ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్రాన్ని కులాల కురుక్షేత్రంగా మార్చేస్తున్నారని… కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కొమ్మినేని విమర్శించారు.

గతంలో చంద్రబాబును తాను దగ్గర నుంచి గమనించానని అప్పట్లో మరీ ఇంత దారుణంగా ఉండేవారు కాదని చెప్పారు. ఇప్పుడు సీఎం ధోరణిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇలా చంద్రబాబు ఎందుకు మారారో, ఆయనకు ఏమైందో తమలాంటి వారికి కూడా అర్ధం కావడం లేదన్నారు. ఒక కులానికి చెందిన వార్తలను అడ్డుకునేందుకు ఛానళ్లపై నిషేధం విధించడం దుశ్చర్యలాంటిదేనన్నారు. చంద్రబాబు వల్ల ఏపీలో కులాల సంకుల సమరం ఆరంభమవుతుందన్న ఆందోళన కలుగుతోందని కొమ్మినేని చెప్పారు.

చంద్రబాబు భావప్రకటన స్వేచ్చను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి అన్నారు. ఒక హోంమంత్రి స్వయంగా తామే ఛానల్‌ ఆపేశామని ప్రకటించడం బట్టే ప్రభుత్వ స్వభావం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News