పులివెందులలో జగన్ కాళ్ల మీద పడిన వ్యక్తి ఇప్పుడు మంత్రి అయ్యారు...

2014కు ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే రాజకీయ వ్యభిచారులు, వెదవలు, కన్నతల్లిని తాకట్టుపెట్టే వారు, కట్టుకున్న దాన్ని అమ్ముకునే వెదవలు అని చంద్రబాబు విమర్శించారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. మరి అదే చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చెప్పినట్టే ఇప్పుడు పార్టీ మారుతున్న వారంతా రాజకీయ వ్యభిచారులు, కన్నతల్లిని తాకట్టుపెట్టేవారు, కట్టుకున్న దాన్ని అమ్ముకున్న వారేనా అని ప్రశ్నించారు. అన్నాహజారేకు బంధువును, కేజ్రీవాల్‌కు […]

Advertisement
Update:2016-06-14 12:27 IST

2014కు ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే రాజకీయ వ్యభిచారులు, వెదవలు, కన్నతల్లిని తాకట్టుపెట్టే వారు, కట్టుకున్న దాన్ని అమ్ముకునే వెదవలు అని చంద్రబాబు విమర్శించారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. మరి అదే చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చెప్పినట్టే ఇప్పుడు పార్టీ మారుతున్న వారంతా రాజకీయ వ్యభిచారులు, కన్నతల్లిని తాకట్టుపెట్టేవారు, కట్టుకున్న దాన్ని అమ్ముకున్న వారేనా అని ప్రశ్నించారు. అన్నాహజారేకు బంధువును, కేజ్రీవాల్‌కు బామ్మరిదిని అని చెప్పుకునే చంద్రబాబు … ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నావ్ అని నిలదీశారు. చంద్రబాబు భారతదేశ రాజకీయాల్లో ఒక అఘోర అని అభివర్ణించారు.

తాను అధికారంలోకి వస్తానన్న నమ్మకం చివరి నిమిషం వరకు చంద్రబాబుకు గానీ, టీడీపీ నాయకులకు గానీ లేదన్నారు. ఒక రోజు పులివెందులలో జగన్‌ పర్యటిస్తుండగా టీడీపీ నేత ఒకరు వచ్చి కారు ఆపి మరీ జగన్‌ కాళ్ల మీద పడ్డారని అందుకు తామే సాక్ష్యమన్నారు. కాళ్లమీద పడిన టీడీపీ నేత ఎలాగైనా తనకు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వాలని కోరారని అయితే తాను మరొకరికి మాట ఇచ్చేశానని, పార్టీని నమ్ముకున్నవారికే టికెట్ ఇస్తున్నానని చెప్పడంతో సదరు నేత టీడీపీలోనే ఉండిపోయారని చెప్పారు. ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారని వెల్లడించారు. ఆయన పేరు చెప్పడం భావ్యం కాదనే చెప్పడం లేదన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు తమను ట్రైన్‌లోనే కలిసి మీరైనా జగన్‌కు చెప్పండి టికెట్ ఇస్తే వైసీపీలోకి వచ్చేస్తానని బతిమలాడుకున్నారని కోటంరెడ్డి చెప్పారు. అది వీలు కాకపోయే సరికి ఇప్పుడు సదరు నేత టీడీపీలోనే ఉండి మంత్రి అయ్యారన్నారు. కేవలం మోదీ, పవన్ కల్యాణ్, రుణమాఫీహామీ, దొంగ హామీలు ఇవ్వని జగన్ నిజాయితీ కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్‌ సునామీ ముందు చంద్రబాబు నిలబడలేరని అన్నారు. రాష్ట్రంలో సాక్షి ప్రసారాలు రాకుండా అడ్డుకున్నారని… భవిష్యత్తులో ఇదే పరిస్థితి మిగిలిన ఛానళ్లకు రావడం ఖాయమన్నారు. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకోవాలని ఆయన సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News