మందారంలో...రక్తపోటుకి మందు!
ఇది నిజంగా మంచివార్తే. మనకి బాగా అందుబాటులో ఉండేవాటిలో ఔషధ గుణాలు ఉంటే మంచిదే కదా. ఇప్పటివరకు మందారపూలు, ఆకుల్లో కురులకు మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయనే మనకు తెలుసు. కానీ మందార పూలల్లో అధిక రక్తపోటుని తగ్గించే అద్భుత గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మందార పూలతో తయారయిన టీని సేవిస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని, అంతేకాకుండా దీంతో తొలిదశలో ఉన్న హైపర్ టెన్షన్‌ని పూర్తిగా తగ్గించవచ్చని కనుగొన్నారు. అమెరికాలోని హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చి […]
ఇది నిజంగా మంచివార్తే. మనకి బాగా అందుబాటులో ఉండేవాటిలో ఔషధ గుణాలు ఉంటే మంచిదే కదా. ఇప్పటివరకు మందారపూలు, ఆకుల్లో కురులకు మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయనే మనకు తెలుసు. కానీ మందార పూలల్లో అధిక రక్తపోటుని తగ్గించే అద్భుత గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మందార పూలతో తయారయిన టీని సేవిస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని, అంతేకాకుండా దీంతో తొలిదశలో ఉన్న హైపర్ టెన్షన్‌ని పూర్తిగా తగ్గించవచ్చని కనుగొన్నారు.
అమెరికాలోని హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చి సెంటర్ వారు ఈ పరిశోధనను నిర్వహించారు. 30 నుండి 70ఏళ్ల మధ్య వయసున్నవారిని రెండు బృందాలుగా విడగొట్టి, అందులో ఒక బృందానికి ఆరువారాలపాటు రోజుకి మూడు కప్పుల చొప్పున మందారపు టీని ఇచ్చారు. మరొక బృందానికి మందారపు రసం పేరుతోనే కృత్రిమ ద్రవాన్ని ఇచ్చారు. మందారపు టీని తీసుకున్న వారిలో సాధారణ రక్తపోటుతో పాటు, అధిక రక్తపోటు కూడా తగ్గటం గమనించారు. అధిక రక్తపోటుకి ఇది విశేషంగా పనిచేయటం గుర్తించారు. మందార పూలలోని ఈ ఔషధ గుణాల పరిశోధన పూర్తిగా ఒక కొలిక్కి వస్తే…త్వరలో మనకు మందార పూల టీపొడులు అందుబాటులోకి రావచ్చన్నమాట.