ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌... రాజీనామాకు సై అన్న నేత

తెలంగాణ కాంగ్రెస్‌కి గట్టి దెబ్బే తగిలింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవింద్రనాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని వారు మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించారు. వీరితోపాటు మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌ కూడా తాము పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. వీరంతా ఈనెల 15న కారేక్కనున్నారు. వీరు పార్టీ మారకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. మీడియాతో మాట్లాడిన ఎంపీ, […]

Advertisement
Update:2016-06-13 10:01 IST

తెలంగాణ కాంగ్రెస్‌కి గట్టి దెబ్బే తగిలింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవింద్రనాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని వారు మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించారు. వీరితోపాటు మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌ కూడా తాము పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. వీరంతా ఈనెల 15న కారేక్కనున్నారు. వీరు పార్టీ మారకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.

మీడియాతో మాట్లాడిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వీడుతున్నందుకు తమకు బాధగా వుందన్నారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా వున్నాని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. అభివృద్ధికోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గతవిభేదాలు తమని కలచివేశాయన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ సామాజిక వర్గానికే చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News