అమరావతికే "అన్న క్యాంటీన్"

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమిళనాడు తరహాలో పేదల కోసం ఐదు రూపాయలకే భోజనం, రూపాయికే సాంబారు ఇడ్లీ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. దీనిపై స్డడీ చేసేందుకు ఒక బృందం తమిళనాడులోనూ పర్యటించి వచ్చింది. అయితే రెండేళ్లు అవుతున్నా పథకం రూపుదిద్దుకోలేదు. తొలుత అన్న క్యాంటీన్లను వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తామని అదే జిల్లాకు చెందిన పరిటాల సునీత గతంలోచెప్పారు. కానీ ఇప్పుడు అన్నక్యాంటీన్లను […]

Advertisement
Update:2016-06-13 03:30 IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమిళనాడు తరహాలో పేదల కోసం ఐదు రూపాయలకే భోజనం, రూపాయికే సాంబారు ఇడ్లీ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. దీనిపై స్డడీ చేసేందుకు ఒక బృందం తమిళనాడులోనూ పర్యటించి వచ్చింది. అయితే రెండేళ్లు అవుతున్నా పథకం రూపుదిద్దుకోలేదు. తొలుత అన్న క్యాంటీన్లను వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తామని అదే జిల్లాకు చెందిన పరిటాల సునీత గతంలోచెప్పారు. కానీ ఇప్పుడు అన్నక్యాంటీన్లను తొలుత అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రయోగాత్మకంగా క్యాంటీన్ లను వెలగపూడిలో ఏర్పాటు చేయనున్నారు. మరో పదిరోజుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భోజనంతో పాటు టిఫిన్ కూడా పెట్టాలా? కాంట్రాక్టు ఎవరికి అప్పగించాలి అన్న దానిపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గుంటూరులో మంగళవారం సమావేశమవుతోంది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత ఉన్నారు కాబట్టి అన్న క్యాంటీన్లు తొలుత అనంతపురంలోనే ఏర్పాటు చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News