కాపులకు కనీసం ఆ హక్కు, అవకాశం కూడా లేదు...

ఇంతకాలం చంద్రబాబును నియంత అని ప్రతిపక్షాలు ఆరోపించేవి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వారంటున్న మాటల్లో తప్పు లేదనిపిస్తోంది. ఏపీలో ఇప్పుడు నిజంగానే ఎమర్జెన్సీ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా చాలా దీక్షలు చేశారు. రాష్ట్రాన్ని ఎవరికీ నష్టం కలగకుండా కొబ్బరిచిప్పలాగా సమానంగా విభజించాలంటూ ఢిల్లీలోనూ టెంట్‌ వేసి దీక్ష చేశారు బాబు. అప్పుడు చంద్రబాబు దీక్ష చేస్తుంటే తెలుగు మీడియా గొట్టాలన్నీ నిద్రాహారాలు మానీ కవరేజ్ ఇచ్చాయి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు. ఓట్లేసిన కాపులపై […]

Advertisement
Update:2016-06-12 10:02 IST

ఇంతకాలం చంద్రబాబును నియంత అని ప్రతిపక్షాలు ఆరోపించేవి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వారంటున్న మాటల్లో తప్పు లేదనిపిస్తోంది. ఏపీలో ఇప్పుడు నిజంగానే ఎమర్జెన్సీ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా చాలా దీక్షలు చేశారు. రాష్ట్రాన్ని ఎవరికీ నష్టం కలగకుండా కొబ్బరిచిప్పలాగా సమానంగా విభజించాలంటూ ఢిల్లీలోనూ టెంట్‌ వేసి దీక్ష చేశారు బాబు. అప్పుడు చంద్రబాబు దీక్ష చేస్తుంటే తెలుగు మీడియా గొట్టాలన్నీ నిద్రాహారాలు మానీ కవరేజ్ ఇచ్చాయి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు. ఓట్లేసిన కాపులపై ఎమర్జెన్సీ ప్రకటించారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే చర్చల సంగతి దేవుడెరుగు. ఆయన ఎలా ఉన్నాడో కూడా తెలుసుకునే అవకాశం సగటు కాపులకు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే.

ప్రజాస్వామ్యంలో దీక్షలను, ధర్నాలను ఇలా కూడా తొక్కిపారేయవచ్చని నిరూపించిన నాయకుడు బాబే. ప్రత్యక్షంగానో ప్రరోక్షంగానో కులాభిమానంతోనో, వ్యాపార సంబంధాలతోనో తెలుగు టీవీ ఛానళ్లు అన్ని బాబు భజనలోనే తరిస్తున్నాయి. ఆ విషయం కాపులకు కొన్ని రోజుల క్రితమే అర్థమైంది. అందుకే ముద్రగడ దీక్ష వార్తలను సాక్షి ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ విషయం తెలిసి సాక్షిని ఏకంగా బంద్‌ చేయించి నియంతలకు తనకు తేడా లేదని నిరూపించుకున్నారు చంద్రబాబు. స్టేట్‌లో అత్యధిక జనాభా తమదేనని చెప్పుకునే కాపులు కూడా బాబు దెబ్బకు మూగబోయారు. ముల్లును ముల్లుతోనే తీయడంలో దిట్ట అయిన చంద్రబాబు… ముద్రగడపైకి కాపు మంత్రులను విడతల వారీగా ఉసిగొల్పుతూనే ఉన్నారు. చంద్రబాబు ఏపీలో సొంత సామ్రాజ్యంలా, సొంత రాజ్యాంగంతో నడుపుతుంటే కేంద్రం గానీ, బలవంతుడని చెప్పుకునే మోదీ గానీ, రాజ్యాంగ రక్షకుడు రాష్ట్రపతి గానీ, న్యాయం కోసం పరితపించే న్యాయస్థానాలు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా స్పందించడం లేదు. అసలు చంద్రబాబు ఏం చేసినా కరెక్టేనని తలూపే స్థాయికి ఈ వ్యవస్థలు చేరాయన్న ఆక్రోశం కూడా జనంలో ఉంది.

ముద్రగడ దీక్ష చేస్తుంటే కనీసం టీవీల్లో స్ర్కో లింగ్‌లు కూడా లేవంటే ఏపీ మీడియా బతుకేంటో ఇట్టే అర్థమవుతుంది. నిప్పులాగా రగులుతున్న కాపు ఉద్యమానికి చంద్రబాబు తన మీడియా సహకారంతో తెరను కప్పే ప్రయత్నం దుస్సాహసమే. 23 శాతం ఉన్నామని భావించే కాపులకే తమ ఉద్యమనాయకుడి గురించి సమాచారం తెలుసుకునే అవకాశం కూడా లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యపాలన కన్నా చంద్రబాబు పాలననడుస్తోందని చెప్పుకోవడమే బెటర్. అసలు ఏపీలో కాపు ఉద్యమం నడుస్తోందని, ముద్రగడ ఇంకా దీక్ష చేస్తున్నారన్న విషయం కూడా చాలా మంది మరిచిపోయారంటే ఏపీ గోబెల్స్ ఎంత పవర్‌ ఫుల్‌ అనుకోవాలి. అంతేలే ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినా కూడా దొరలాగే రాజ్యమేలే అవకాశం ఉన్న ఈ దిక్కుమాలిన వ్యవస్థలో పోలీసుల సాయంతో ఒక కులాన్ని తొక్కివేయడం చంద్రబాబుకు ఏమంత కష్టం కాదు. ఇప్పుడు కళ్లు తెరవాల్సింది కాపులే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News